ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘స్క్విడ్ గేమ్ – సీజన్ 2’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 27, 2024 12:04 AM IST

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌గా ‘స్క్విడ్ గేమ్’ నిలిచింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇండియాలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఓటీటీ స్ట్రీమింగ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్, ఇప్పుడు రెండో సీజన్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యింది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ సిరీస్ తాజాగా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. డబ్బుల కోసం చాలా మంది డేంజరస్ సర్వైవల్ గేమ్‌లో పాల్గొంటారు. అయితే, చివరకు ఎవరు గెలిచారనేది మనకు ఈ వెబ్ సిరీస్‌లో చూపెట్టనున్నారు.

ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి ఎలాంటి డేంజరస్ గేమ్స్ ఈ ‘స్క్విడ్ గేమ్ 2’లో ఉండబోతున్నాయో.. అందులో ఎవరు విజేతలుగా నిలుస్తారో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్‌ను వీక్షించాల్సిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *