టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోలలో ఒకరైన శ్రీ విష్ణు (Sree Vishnu) జీవిత ప్రయాణం ఎంతో చితమైనది. చదువుతో పెద్దగా అనుబంధం లేకుండా, చిన్నప్పటి నుంచే సినిమాలపై విపరీతమైన ఆసక్తితో ఉన్నాడు. చదువుకునే రోజుల్లోనే కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం ఆయనకు అలవాటు. ఎంసెట్ పరీక్షకు ముందు రోజూ సినిమా చూడటం కోసం ఎంసెట్ హాల్ టికెట్ చూపించి బస్సెక్కే ప్రయత్నం చేసిన ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు.
క్రికెట్‌లోను ప్రతిభ చూపిన శ్రీ విష్ణు, ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్-19 క్రికెట్ కూడా ఆడాడు. కానీ ఆ రంగంలో స్థిరపడలేక సినిమాలపై ఫోకస్ పెట్టాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తర్వాత హీరో ఫ్రెండ్‌గా సినిమాల్లో నటించి, తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన “సింగిల్” (Single) సినిమాతో ఆయన కెరీర్‌లో మరో హిట్ చేరింది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్నది.
గోకుల్ థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసిన శ్రీ విష్ణు ఎమోషనల్ అయ్యారు. తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. చిన్ననాటి అల్లరి, చదువు వైపు ఆసక్తి లేకపోవడం, క్రికెట్ నుంచే సినిమాల దాకా సాగిన ప్రయాణం – ఇవన్నీ ఈ యాక్టర్ జీవితాన్ని మరింత స్పెషల్ చేస్తాయి.