మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో షూటింగ్ దశలో ఉంది.
అదే స్టూడియోలో మరో సినిమా షూటింగ్‌లో ఉన్న శ్రీలీల, చిరంజీవి దగ్గరే ఉన్నారని తెలుసుకుని విశ్వంభర సెట్స్‌ను సందర్శించారు. చిరంజీవిని కలిసిన శ్రీలీలకు మెగాస్టార్ శాలువా కప్పి సత్కరించారు. అంతేకాదు, దుర్గాదేవి ముద్రించిన శంఖాన్ని బహుమతిగా అందించారు.
ఈ ప్రత్యేక బహుమతిని అందుకున్న శ్రీలీల తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చిరంజీవి లాంటి లెజెండరీ నటుడి నుంచి బహుమతి అందుకోవడం తనకు గొప్ప ఆనందాన్ని కలిగించిందని చెప్పిన శ్రీలీల, వైరల్ అవుతున్న ఫొటోలతో అభిమానులను ఉల్లాసపరిచారు.
యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన ఈ సినిమా 2025లో విడుదల కానుంది.
ఈ ప్రత్యేక సందర్భం మెగాస్టార్ చిరంజీవి అభిమానులనే కాకుండా శ్రీలీల ఫ్యాన్స్‌ను కూడా ఆనందానికి గురిచేసింది.