Published on Nov 5, 2024 8:30 AM IST
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా “ధూం ధాం” ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘రామ్ కుమార్ గారు నాకు బాగా తెలుసు. వాళ్ల అబ్బాయిని హీరోగా మంచి స్థాయిలో చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కోరిక తీరాలని కోరుకుంటున్నా. పండక్కి రిలీజైన మూడు సినిమాలు సక్సెస్‌ఫుల్ గా వెళ్తున్నాయి. “ధూం ధాం” కూడా ఆ లిస్టులో చేరాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.
నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మా “ధూం ధాం” సినిమా ఈవెంట్ కు పిలవగానే గెస్టులుగా వచ్చిన వైవీఎస్ చౌదరి, శ్రీనువైట్ల, సాయి రాజేశ్ ఇతర గెస్టులకు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు మా టీమ్ అంతా మనసు పెట్టి పనిచేశారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. ఓ పాటలో ఆయన మా రిక్వెస్ట్ మీద కనిపించారు. బ్యూటిఫుల్ విజువల్స్, సాంగ్స్ ఉన్న చిత్రమిది. మా అబ్బాయి చేతన్‌ను హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది. హెబ్బా పటేల్ బాగా నటించింది. గోపీ మోహన్, సాయి కిషోర్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమా తెరకెక్కించారు. వారికి థ్యాంక్స్. “ధూం ధాం” సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మీరంతా సకుటుంబంగా వచ్చి ఈ నెల 8వ తేదీన మూవీ చూడండి.’ అని అన్నారు.
డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ – ‘ “ధూం ధాం” సినిమాలో ఫస్ట్ సాంగ్స్ బాగున్నాయనే టాక్ వచ్చింది. అందుకు గోపీ సుందర్ గారికి, రామజోగయ్య గారికి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమా షూటింగ్ లో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. బాగా నవ్వుకుంటారు. మీ టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం. శ్రీను వైట్ల గారి కామెడీని, వైవీఎస్ గారి సాంగ్స్ స్టైల్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఈ మూవీ చేశాను. సినిమా మేకింగ్ మొత్తం రామ్ కుమార్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా కోసం ఏది అడిగినా, ఎంత బడ్జెట్ అయినా ఇచ్చారు. వారి ఇంట్లో అయినా, పోలెండ్ లో అయినా ఒకేలా చూసుకున్నారు. ఈ సినిమా చేతన్ కు మంచి పేరు తేవాలి, హెబ్బా చాలా ఎనర్జిటిక్ గా చేసింది. ఆమెకు కూడా సక్సెస్ ఇవ్వాలి. ఈ నెల 8వ తేదీన తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి “ధూం ధాం” చూడండి.’ అని అన్నారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ లో 20 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న మా రామజోగయ్య శాస్త్రి గారికి శుభాకాంక్షలు. “ధూం ధాం” సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్టాప్ ప్లెజంట్ గా ఉండి, సెకండాఫ్ హిలేరియస్ గా ఉందని ఈ సినిమాకు వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ చెప్పారు. మా ‘రెడీ’ సినిమా అప్పుడు కూడా సెకండాఫ్ హిలేరియస్ గా ఉందనే టాక్ బిఫోర్ రిలీజ్ కే వచ్చింది. రెడీ సినిమాలా “ధూం ధాం” కూడా బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైనర్ కావాలి. అందరినీ మంచితనంతో ఎలా టీమ్ వర్క్ చేయించుకోవాలో రామ్ కుమార్ గారికి తెలుసు. చేతన్ కూడా తండ్రి గర్వపడే స్థాయికి వెళ్లాలి. “ధూం ధాం” సినిమాకు మా గోపీ మంచి స్క్రిప్ట్ చేశాడు. సాయి కిషోర్ ప్యాషనేట్ గా రూపొందించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకోవాలి.’ అని అన్నారు.