విశాఖ రాజకీయ వర్గాల్లో ఒక వార్త పెను సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి శ్రీ భరత్ ఓడిపోవాలని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడనేది…ఆ వార్త సారాంశంగా ఉంది. నెట్టింట ఇది హల్చల్ గా మారింది.

ఎందుకంటే నాడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబునాయుడు…ఆ తర్వాత నందమూరి వంశంలో ఎవరినీ కూడా పార్టీలోకి రానివ్వలేదు. ఎదగనివ్వలేదు. బయట నుంచి నందమూరి వంశానికి ఎంతైనా సాయం చేస్తే చేసి ఉండవచ్చుగానీ, పార్టీలోకి మాత్రం అడుగుపెట్టనివ్వలేదు.

దీనికి బలమైన కారణం ఏమిటంటే…ఎవరినైనా పార్టీలో పెట్టుకుంటే, తనకి ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారోననే భయమే, పార్టీలోకి ఎవరినీ రప్పించలేదని అంటారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలో పిలిచి కేంద్ర మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఒప్పుకోలేదు. మళ్లీ ఢిల్లీలో కేంద్ర మంత్రులు గ్రూపులు పెడితే, అసలుకే మోసం వస్తుందని భయపడి వద్దని అనేశాడు. దాంతో వాజ్ పేయి ఎంతో అభిమానంతో స్పీకర్ పదవినిస్తే, దానిని నోరులేని నాటి ఎంపీ బాలయోగికి ఇప్పించాడు.

నందమూరి వంశం తెరచి ఉంచిన పుస్తకం. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎక్కడా అతిశయోక్తులు లేవు. కాకపోతే నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారంతే. నందమూరి వంశం నుంచి చంద్రబాబు ఎవరినీ రాజకీయాల్లోకి రానివ్వలేదు. ఎదగనివ్వలేదనేది అందరికీ తెలిసిన సత్యం.

ముఖ్యంగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకి మాత్రమే తెలుగుదేశం పార్టీపై పూర్తి సర్వాధికారాలు ఉన్నాయి. ఆయనే నిజమైన వారసుడు. నేటి బాలక్రష్ణ ఎంతమాత్రం కాదని అందరూ అంటారు. ఎందుకంటే నాడు చైతన్యరథంపై ఎన్టీఆర్ తో రాష్ట్రమంతా తిరిగింది హరికృష్ణ అన్నది అందరికీ తెలిసిందే.

కానీ కాలగమనంలో హరికృష్ణకి తెలుగుదేశం పార్టీలో స్థానమే లేకుండా పోయింది. ఆయన తెలుగుదేశంతో విభేదించి సొంత పార్టీ కూడా పెట్టారు. అదీ విఫలమైంది. అయితేనేం నేడు తెలంగాణలో ఎంతో మంది తెలుగుదేశం నేతలకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అయినా, సీట్లు ఇచ్చింది మాత్రం హరికృష్ణ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటివారిలో నేటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు.

ఆ క్రతజ్నతతోనే హరికృష్ణ మరణిస్తే, అధికార లాంఛనాలతో తనకి అంత్యక్రియలు జరిపించారు. ఒక సాధారణ హరికృష్ణకి అంతటి ప్రాధాన్యత ఎందుకు లభించింది? ఒకసారి ఆలోచించండి. ఇదే క్రమంలో ఎన్టీఆర్ కి కుడిభుజంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పార్టీలోంచి గెంటేశారు. ఆయన భార్య పురందేశ్వరిని గెంటేశారు. అప్పుడే వారు రోడ్డుమీద పడి, చంద్రబాబుని శాపనార్థాలు పెడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా పురంధేశ్వరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర.

అనంతరం నందమూరి తారకరత్న కూడా సినిమాల్లో ఫెయిల్ అయ్యాక రాజకీయాల్లోకి వద్దామని చూస్తే బలవంతంగా ఆపించారని అంటారు. అప్పట్లో తన స్పీచ్ లు చాలా ప్రభావంతంగా ఉండేవి. మెచ్యూర్డుగా ఉండేవి. తర్వాత కాలంలో లోకేష్ కి సలహాదారుగా రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే కన్నుమూశాడు.

అంతకుముందు హరికృష్ణ కుమార్తెకు కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా సీటు ఇచ్చారు. ఆంధ్రా విభజన తర్వాత తెలంగాణలో పార్టీకి సీన్ లేని తర్వాత ఆమె ఎలా గెలుస్తారని సీటు ఇచ్చారని కూడా అంటారు. హరిక్రష్ణపై అంత అభిమానం ఉంటే, ఆ ఇచ్చేదేదో ఆంధ్రాలో ఇవ్వచ్చు కదా అనే డిమాండ్లు వినిపించాయి.

ఇదిలా ఉండగా… వీళ్లందరినీ దాటుకుని నందమూరి వంశం నుంచి ఇప్పుడు శ్రీ భరత్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా సీటు సంపాదించాడు. జనరల్ గా 2019లో కూడా పోటీ చేసిన శ్రీ భరత్ ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో 2024లో కూటమితో జట్టు కట్టి, విశాఖను బీజేపీ ఖాతాలో చంద్రబాబు పడేశాడనే విమర్శలు వచ్చాయి. అయితే పట్టువదలని శ్రీ భరత్ మొత్తానికి సీటు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు వీటన్నింటికి సీక్వెన్స్, ఇంటర్ లింక్ ఇక్కడ ఛార్జ్ అవుతోంది. మొత్తానికి నందమూరి వంశంలో చంద్రబాబు వారసుడిగా లోకేషు రాజకీయాల్లో ఎదగాలని చూస్తున్నాడు. ఇప్పుడదే వయసున్న శ్రీ భరత్ ఎన్నో రెట్లు లోకేష్ కన్నా బెటర్ అని అందరూ అంటున్నారు. ఒకవేళ లోకేష్ గాని రాజకీయాల్లో ఫెయిల్ అయితే శ్రీ భరత్ పార్టీ పగ్గాలు పట్టుకుండానేది ఒక టాక్ నెట్టింట నడుస్తోంది. కాకపోయినా లోకేష్ ని ఓవర్ కమ్ చేసి లాగేసుకుంటాడని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతటి రాజకీయ నిష్ణాతుడైనా, వ్యూహకర్త అయినా కుటుంబంలో తన వరకు పోటీ లేకుండా చూసుకున్నాడని, కొడుకు వద్దకు వచ్చేసరికి పని జరగడం లేదు.

ఇదీ సంగతి. అందుకనే శ్రీ భరత్ గెలవకుండా ఆపేందుకు తెరవెనుక తతంగాలన్నీ జరుగుతున్నాయని కూడా అంటున్నారు. ఇది విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీకి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.