Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

  • సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన జరిగి రెండు వారాలు అవుతుంది: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
  • ఈరోజు ప్రభుత్వం తరపు నేను, హెల్త్ సెక్రటరీ శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాము..
  • తొక్కిసలాటలో శ్రీ తేజ్ కు బ్రెయిన్ డమేజ్ జరిగింది, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతానికి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు ఆ బాలుడిని హైదరాబాద్ సి పి సి వి ఆనంద్ పరామర్శించారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రెండు వారాలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున తనతో పాటు హెల్త్ సెక్రటరీ కూడా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నామని అన్నారు.

Sandhya Theatre stampede:సంధ్య థియేటర్‌ కి మరో షాక్?

తొక్కిసలాటలో శ్రీ తేజ బ్రెయిన్ డామేజ్ జరిగిందని, రికవరీ జరగడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు ఈ ట్రీట్మెంట్ సుధీర్గంగా సాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పుకొచ్చారు. మరోపక్క హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ శ్రీ తేజ్ ట్రీట్ మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని అన్నారు. వైద్యులను ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామని పేర్కొన్న ఆమె శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *