కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ మహాత్మా గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన కారణంగా, వెంకట్ ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కి తెలియజేశారు. ఆయన అభ్యర్థన ప్రకారం, శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించబడింది. ఎంఎల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో విభజనలు, ఘర్షణలు రావచ్చని హెచ్చరించారు. “పెద్ద హీరోలు కూడా స్పందించాలి. ఆయనపై చర్యలు తీసుకోకపోతే, మేము యాంటీబాయోటిక్‌గా స్పందిస్తాము” అని చెప్పారు. మా జనరల్ సెక్రటరీ శివ బాలాజీ వివరాలిచ్చి, “మాకు డిసిప్లినరీ కమిటీ ఉంది. ఈ విషయాన్ని చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. త్వరలో మీటింగ్ పెట్టి అవసరమైన చర్యలు చేపడతాం” అని తెలిపారు.