శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు కీలక విషయాలను ఆయన బయట పెట్టారు. ఈ సినిమాలో తాను ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు తాను ప్రోస్థటిక్ మేకప్ తో ఒక్క సినిమా కూడా చేయలేదని ఈ సినిమా కోసం ఆ ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అ మేకప్ వేసుకోవడం చాలెంజింగ్ అనిపించిందని వేసుకోవడానికి అలాగే తీయడానికి కూడా చాలా సమయం పట్టేదని అన్నారు.
Mohan Babu: పరారీలో లేను.. మోహన్ బాబు కీలక ప్రకటన
ఇక తన గెటప్ తన తండ్రిని పోలి ఉండేలాగా సిద్ధం చేశారని ఒకరోజు అదే గెటప్లో మా ఇంటికి వెళ్లి మా అమ్మ ముందుకు వెళ్లి నిలబడితే ఆమె ఒక నిమిషం పాటు షాక్ కి గురైందని చెప్పుకొచ్చారు. బిత్తరపోయి మా నాన్న వచ్చారా అన్నట్టు ఆమె కాసేపు స్టన్ అయిపోయిందని నేను కూడా ఏడిపించడానికి మా నాన్న పిలిచినట్టు బేబీ అంటూ పిలిచాను అని ఆయన అన్నారు. మా అమ్మ నన్ను అలా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ నాకు సెట్ అయిందని అనిపించినట్లు ఆయన అన్నారు. నిజానికి తన వయసుకు తగ్గ పాత్రలు ఇప్పటి వరకు చేస్తూ వచ్చానని, ఇది ఒక రకంగా తనకు కూడా ఛాలెంజ్ అంటూ శ్రీకాంత్ వెల్లడించారు. శంకర్ లాంటి దర్శకుడి సినిమాలో తాను ఇలాంటి మంచి పాత్ర చేస్తానని ఇప్పటి వరకు అనుకోలేదని సమయానుకూలంగా ఈ పాత్ర రావడం రామ్ చరణ్ కాంబినేషన్లో చేయడం జరిగిపోయిందని ఆయన వెల్లడించారు.