Published on Dec 4, 2024 5:03 PM IST
లేటెస్ట్ గా మన టాలీవుడ్ లో షేక్ చేసిన సాలిడ్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అని చెప్పాలి. మరి జస్ట్ అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి చిరు, శ్రీకాంత్ ఓదెల సహా నిర్మాత, నాచురల్ స్టార్ నాని కూడా వరుస పోస్ట్ లతో అభిమానులకి కిక్ ఇచ్చారు.
ఇక ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఓదెల మాత్రం తన చిరకాల హీరో మెగాస్టార్ పై ఉన్న ప్రేమని ఓ రేంజ్ లో వ్యక్తం చేస్తున్నాడు. ఆల్రెడీ ఎక్స్ ఖాతాలో తన ఎగ్జైట్మెంట్ ని పంచుకున్న శ్రీకాంత్ లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు తాను చిరంజీవితో కలిసి వర్క్ చేయడంపై క్రేజీ పోస్టర్ ని పెట్టడం మంచి ఫన్నీ అండ్ తన అభిమానాన్ని చాటి చెప్తుంది.
అయితే ఇందులో మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ “ఇంద్ర” సినిమాలో చిరు పోస్టర్ పక్కన చిన్న నాటి తేజ సజ్జ తొడగొట్టే షాట్ రెండిటిని కలిపి మొన్న ఇంద్ర రీ రిలీజ్ కి ఫ్యాన్స్ సూపర్ గా రెడీ చేశారు. ఆ చిన్నోడి చెయ్యి పట్టుకున్న మెగాస్టార్ ఫ్రేమ్ లా ఇది పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇపుడు ఇదే పోస్టర్ లో చిరు పక్కన ఉన్న తేజ సజ్జ తల ప్లేస్ లో శ్రీకాంత్ ఓదెల ఉన్న పిక్ ని షేర్ చేయడం ఇపుడు ఫ్యాన్స్ లో మంచి ఎనర్జిటిక్ మూమెంట్ లా మారింది. అలాగే మెగాస్టార్ అంటే తన అభిమానులకి ఈ రేంజ్ ప్రేమ ఉంటుందా అనేది మరింత మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పాలి.