ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రికార్డుల భరతం పడుతోంది. అటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఈ క్రమంలో జరిగిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి పని చేసిన టీమ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, కొన్ని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ట్రక్ ఎపిసోడ్, అలాగే చిన్ననాటి ఎపిసోడ్ వంటి కీలక సన్నివేశాలను తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ దర్శకత్వం వహించాడని సుకుమార్ చెప్పాడు.
ఐతే, దర్శకత్వం టైటిల్ కార్డ్‌లలో శ్రీమాన్ పేరును యాడ్ చేయనందుకు తాను ఫీల్ అవుతున్నట్లు సుకుమార్ చెప్పడం విశేషం. నిజంగా ఓ స్టార్ డైరెక్టర్ ఈ విధంగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పడం అందర్నీ ఆట్టుకుంది. ముఖ్యంగా సుకుమార్ మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా ‘ఈ సినిమాకు నేను దర్శకుడ్ని కాదు.. వీళ్లంతా దర్శకులే. పొరపాటున నా పేరు వేసుకొన్నా` అని సుకుమార్ చెప్పడం.. సుకుమార్ గొప్పతనానికి, సంస్కారానికీ నిదర్శనం. ఇక సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని బలంగా కొనసాగిస్తోంది. అన్ని ఏరియాల్లో సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి.
The post సుకుమార్ గొప్పతనానికి ఇది నిదర్శనం ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.