‘లక్కీ భాస్కర్’ నుంచి శ్రీమతి వీడియో సాంగ్.. ఎప్పుడంటే? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే, ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాలోని ‘శ్రీమతి గారు’ అనే వీడియో సాంగ్‌ని అక్టోబర్ 15న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో దుల్కర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఆయన భార్యగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవోతంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ‘లక్కీ భాస్కర్’ నుంచి శ్రీమతి వీడియో సాంగ్.. ఎప్పుడంటే? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *