‘పుష్ప 2’ కి ప్రమోషన్స్ అక్కర్లేదు – రాజమౌళి | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 3, 2024 8:05 AM IST

ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రమోషన్స్ అక్కర్లేని సినిమా పుష్ప. యావత్ ఇండియా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది అంటే, అంతకన్నా వేరే ప్రమోషన్స్ అవసరం లేదని చెప్పాలి. తెలుగు సినీ చరిత్రలో నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుతారని ఆశిస్తున్నా. సుకుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం ఖాయం.” అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *