SSMB29 Movie Shooting Moves to Odisha
SSMB29 Movie Shooting Moves to Odisha

SSMB29 సినిమా కోసం మహేష్ బాబు పూర్తి ఫోకస్ పెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. అయితే, దర్శకుడు ఎటువంటి అప్‌డేట్స్ కూడా బయటకు రానివ్వకుండానే చాలా గోప్యత పాటిస్తున్నారు.

తాజాగా, SSMB29 షూటింగ్ ఒడిశాలో జరుగుతుందని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన తర్వాత, రాజమౌళి టీమ్ ప్రస్తుతం ఒడిశాలో 23 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసింది. డియోమాలి, తలమాలి, కాళ్యమాలి అడవుల్లో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమా నిర్మితమవుతోంది.

రాజమౌళి ఈ చిత్ర టాకీ ఒకే ఏడాదిలో పూర్తిచేసి, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రం 2027లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే ఒడిశాలో రాజమౌళి హోటల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *