Published on Oct 19, 2024 8:30 AM IST
మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యువ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డకి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే ఈ తన సోదరుడు చైతూ జొన్నలగడ్డ కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చి మంచి పాత్రలతో అలరించడం స్టార్ట్ చేశారు. బబుల్‌గమ్, భామాకలాపంలో మంచి రోల్స్ పోషించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను మెప్పించాడు. ఇక ఇప్పుడు చైతూ తనలోని మల్టీటాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
‘ఎంఎం2’ అంటూ తనలోని రైటర్, యాక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల్ని కూడా లైన్‌లో పెట్టాడు. తన వద్దకు వచ్చిన పాత్రల్ని వడపోసి.. తనకు నచ్చిన కారెక్టర్‌లను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో చైతూ జొన్నలగడ్డ ఓ మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు. హిట్ 3లో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈటీవీ విన్‌లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పవన్ సాధినేనితో మరో సినిమాను చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో ఎంఎం 2 స్టార్ట్ చేయబోతున్నారు.