‘మహేష్ – రాజమౌళి’ సినిమా పై కొత్త గాసిప్ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 1, 2025 10:14 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం “గుంటూరు కారం”తో గత ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాపై ఇపుడు ఓ స్ట్రింగ్ బజ్ వినిపిస్తుంది.

దీనితో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ రోజు ఈ కొత్త ఏడాదితో రానే వచ్చిందట. దీనితో ఈ అవైటెడ్ చిత్రాన్ని మేకర్స్ రేపు జనవరి 2న ముహూర్త కార్యక్రమాలతో లాంచ్ చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో ఈ కొత్త ఏడాదితో ఈ సినిమా మొదలు కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా మేకర్స్ ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *