ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ చిత్రం పుష్ప 2 తోనే కాకుండా తన అరెస్ట్ విషయంలో కూడా మరోసారి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యి కూర్చున్న సంగతి తెలిసిందే. అయితే తన సినిమా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఎలాంటి బాండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఆర్య నుంచి మొదలైన వీరి ప్రయాణం ఇపుడు పుష్ప 2 వరకు మరింత బలంగా ఎమోషనల్ గా ముడి పడుతూ వచ్చింది.
అయితే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యి వచ్చాక సుకుమార్ కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ తో మాట్లాడుతూ సుకుమార్ కంటతడి పెట్టుకున్న దృశ్యాలు వీరి మధ్య ఎలాంటి బంధం ఉంది అనేది చూపిస్తున్నాయి అని అభిమానులు అంటున్నారు. దీనితో వీరిద్దరిపై వీడియోలు వైరల్ గా మారాయి. ఇక మరో పక్క వీరి పుష్ప 2 ఆల్రెడీ భారీ వసూళ్లతో ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
#Sukumar sir " We Love You " ????@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj
— Trends Allu Arjun (@TrendsAlluArjun) December 14, 2024
The post బన్నీతో బాండింగ్.. సుకుమార్ ఎమోషనల్ క్లిప్ వైరల్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.