‘పుష్ప 2′ సినిమాని చూడటానికి వచ్చి, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అవ్వడం మొత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే, ఈ విషయం పై కొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. తాజాగా సీనియర్ హీరో సుమన్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు.
ఇంతకీ, సుమన్ ఏం మాట్లాడారు అంటే.. ఆయన మాటల్లోనే విందాం. ‘అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ తప్పే. ఒక స్టార్ హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత అనేది థియేటర్ యాజమాన్యం చూసుకోవాలి. అది వారి బాధ్యత. క్రౌడ్ కు తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోకపోవడం వారి తప్పు. ఒక నటుడిగా థియేటర్ కు వెళ్లడం అనేది అల్లు అర్జున్ తప్పు ఎలా అవుతుంది ?, దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోలను థియేటర్ యాజమాన్యం పిలవాలి’ అంటూ సుమన్ చెప్పుకొచ్చారు.
The post అది అల్లు అర్జున్ తప్పు ఎలా అవుతుంది ? – సుమన్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.