
2025 వేసవి టాలీవుడ్ బాక్సాఫీస్ హీటెక్కుతోంది! స్టార్ హీరోల సినిమాలు తక్కువగా ఉన్నప్పటికీ, మీడియం రేంజ్ సినిమాలు మాత్రం హౌస్‌ఫుల్ బిజినెస్ చేస్తుండటంతో టాలీవుడ్ ఆసక్తికరమైన సమ్మర్‌ను ఎదుర్కొంటోంది.
మార్చి 28న పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా విడుదలైతే 200 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అదే రోజు నితిన్ “రాబిన్ హుడ్”, మార్చి 29న “మ్యాడ్ స్క్వేర్” రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు 50 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది.
ఏప్రిల్ మొదటి వారంలో సిద్ధూ జొన్నలగడ్డ “జాక్” (ఏప్రిల్ 10) విడుదల కానుంది. గతంలో “టిల్లు స్క్వేర్” తో ఘన విజయం సాధించిన సిద్ధూకి ఇది మరో పరీక్ష. ఏప్రిల్ 18న అనుష్క, క్రిష్ కాంబినేషన్లో “ఘాటీ” సినిమా రాబోతుంది. అనుష్క నాలుగేళ్ల విరామం తర్వాత వస్తుండటంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 25న మంచు విష్ణు “కన్నప్ప” విడుదల అవుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ స్పెషల్ అప్పీర్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 1న నాని “హిట్ 3” విడుదల కానుంది. టీజర్ విడుదలైన దగ్గర నుంచి సినిమాపై బజ్ బాగా పెరిగింది.
ఈ వేసవిలో స్టార్ హీరోల కంటే కంటెంట్ బలమైన సినిమాలు హవా చూపించనున్నాయి. మరి బాక్సాఫీస్‌ను ఏ సినిమా షేక్ చేస్తుందో చూడాలి!