
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం మజాకా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, ధమాకా వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన త్రినాధ్ రావు, ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందిస్తున్నారని అంటున్నారు.
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ తన ఆరోగ్య సమస్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సైనస్ సమస్య ఉందని, దీని వల్ల షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. షూటింగ్ బ్రేక్ లో వ్యాన్ లో నిద్రపోతే, లేవగానే ముక్కు పూర్తిగా బ్లాక్ అవుతుందని, గాలి పీల్చడం కూడా కష్టంగా మారుతుందని వివరించారు.
అదే కాకుండా, ఉదయం ఎవ్వరితోనూ మాట్లాడకుండా వేడి టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్ వినాల్సి వస్తుందని అన్నారు. దీనికి సర్జరీ చేయించుకోవచ్చు కానీ, ఆపరేషన్ వల్ల ముఖం మారిపోతుందనే భయం ఉందని చెప్పారు. అంతేకాకుండా, నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండటం వల్ల షూటింగ్ షెడ్యూల్ డిస్ట్రబ్ అవుతుందని వివరించారు.
ఇప్పటికే ఊరుపేరు భైరవకోన హిట్‌తో మంచి ఫామ్‌లో ఉన్న సందీప్, మజాకా సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు.