యాక్షన్ ప్రేమ కథతో ‘కాక్రోచ్’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 14, 2024 8:15 AM IST

దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో బి బాపిరాజు మరియు ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తం గా నిర్మిస్తున్న “కాక్రోచ్ “ చిత్రం టైటిల్ ని విజయదశమి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. విశాఖపట్నం నేపథ్యం లో సాగే ఈ వైలెంట్ యాక్షన్ ప్రేమ కథ , పాత కొత్త నటీ నటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.

కాగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని చిత్ర బృందం తెలియచేస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి త్వరలో మరిన్ని వివరాలతో ప్రేక్షకులని కలుస్తామని చిత్రబృందం తెలిపింది. విభిన్న చిత్రాలని ఆదరించే ప్రేక్షకులందరికీ యూనిట్ పరిశుభ్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలియచేసింది,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *