Published on Dec 6, 2024 10:55 PM IST
అక్కినేని ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి కార్యక్రమంతో రెండు కుటుంబాల సభ్యులు ఒకచోట చేరి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇక నాగచైతన్య వివాహంతో అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా సంతోషం నిండింది.
సురేష్ బాబు, వెంకటేష్‌ల మేనల్లుడు అయిన నాగచైతన్య పెళ్లిలో వారు కూడా సందడి చేశారు. పెళ్లికొడుకును చేయడం దగ్గర్నుండి పెళ్లిలో పెద్దలుగా నూతన వధూవరులను ఆశీర్వదించే వరకు మేనమామలు నాగచైతన్య వెన్నంటే ఉన్నారు. తమ సోదరి ముఖంలో సంతోషాన్ని చూసి దగ్గుబాటి సోదరులు మురిసిపోయారు.
ఈ పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా జరగ్గా, కొందరు సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి తరువాత శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మల్లికార్జున స్వామీని దర్శించుకున్నారు.