Published on Dec 3, 2024 6:59 AM IST
తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జె్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు శివ. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక ఈ సినిమా తరువాత సూర్య ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య తన కెరీర్‌లోని 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఆర్.బాలాజీ డైరెక్షన్‌లో సూర్య తన 45వ చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ తాజా వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా కథ తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘వీర’ చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో సూర్య చేయబోయేది ఓ ఫ్లాప్ మూవీ రీమేక్ కథనా… అంటూ సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.