స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక జిమ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీళ్లు ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న హై క్లాస్ జిమ్ లో వ్యాయామాలు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా సూర్య, జ్యోతిక ఫిట్ నెస్ గోల్స్ ఇస్తున్నారు. సోలోగా చేసే ఎక్సయిర్ సైజ్ లతో పాటు ఇద్దరు కలిసి జిమ్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఈ జంట ఫిట్ నెస్ కోసం ఎంత శ్రమిస్తున్నారో ఈ వీడియో చూపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక, సూర్యను బెస్ట్ కపుల్ అని కోలీవుడ్ లో పిలుస్తుంటారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.

పెళ్లయ్యాక జ్యోతిక సినిమాలు తగ్గించింది. ఏవైనా వుమెన్ ఓరియెంటెడ్, స్టోరీ చాలా బాగున్న స్పెషల్ మూవీస్ మాత్రమే చేస్తోంది. ఇటీవల మమ్ముట్టితో కలిసి కాదల్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో జ్యోతిక నటనకు మంచి పేరొచ్చింది. పలు భారీ చిత్రాలతో సూర్య హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువలో నటిస్తున్నాడు. దీంతో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు సూర్య.