సూపర్ స్టార్ ఒక్కడే.. అది రజినీకాంత్ మాత్రమే – సూర్య | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 24, 2024 1:00 AM IST

తమిళ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. నార్త్‌లో ‘కంగువా’ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ముంబైలో ఈ చిత్ర ప్రమోషన్‌లో హీరో సూర్య పాల్గొన్నాడు.

ఆయనతో పాటు నటుడు బాబీ డియోల్, దిశా పటాని కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ విలేకరి సూర్యని ‘సూపర్ స్టార్’ అని పిలిచారు. దీంతో సూర్య వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘సూపర్ స్టార్ ఎప్పటికీ ఒక్కరే.. అది ఖచ్చితంగా రజినీకాంత్ మాత్రమే. ఇలా సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి పడితే వారికి వాడొద్దు’ అంటూ సూర్య అన్నాడు.

దీంతో సూర్య చేసిన ‘సూపర్ స్టార్’ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సూర్య మాట్లాడిన తీరుకి రజినీ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *