Published on Oct 13, 2024 11:00 PM IST
హీరోయిన్ తాప్సి తాజాగా తనకు ఎదురైన ఓ చేదు ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీరియస్ అయ్యింది. అసలు ఏం జరిగింది అంటే.. తాప్సి ప్రయాణం చేస్తున్న టర్కిష్ ఎయిర్ లైన్స్ 24 గంటలు ఆలస్యమైంది. మరోవైపు కస్టమర్ కేర్ సర్వీసు కూడా అందుబాటులో లేదు. దీంతో తాప్సి ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో తాప్సి అసహనం వ్యక్తం చేస్తూ.. ‘ఎయిర్‌లైన్స్ 24 గంటలు ఆలస్యం అనేది మీ సమస్య. ఇది ప్రయాణికుల సమస్య కాదు’ అని ఆమె తన పోస్ట్‌లో పెట్టారు.
తాప్సి తన పోస్ట్ లో ఇంకా రాసుకొస్తూ.. ‘విమానం ఆలస్యంపై ఎలాంటి ముందస్తు సమాచారం తమకు ఇవ్వలేదు’ అని తాప్సి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే, తనకు ఎదురైన ఈ అనుభవం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మాత్రం తాప్సి క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా హీరోయిన్ శ్రుతిహాసన్.. విమానయాన సంస్థ ఇండిగో సేవలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాప్సి కూడా అసహనం వ్యక్తం చేశారు.