ఆ మాటలపై ప్రతిరోజూ పోరాటం చేస్తున్నా – తాప్సీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 3, 2024 6:11 PM IST

సొట్టబుగ్గల సుందరి తాప్సీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక, హాట్ కామెంట్స్ చేయడం అలవాటు చేసుకుంది. తాజాగా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ సినిమాలో తానేమీ అధిక మొత్తంలో పారితోషికం అందుకోలేదని తాప్సీ కామెంట్స్ చేసింది. ఇంతకీ, తాప్సీ ఏం మాట్లాడింది అంటే.. ‘నేను సినీ పరిశ్రమలో ఎంతోకాలం నుంచి ఉన్నాను. భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాను. ఐతే, పారితోషికం విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ‘జుడ్వా 2’, ‘డంకీ’ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ అందుకున్నానని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ, ఆ కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ని ఒక్కొక్కరూ ఒక్కోలా చూస్తారు. మా సినిమాలో షారుక్‌ ఖాన్‌ లాంటి పెద్ద హీరో ఉన్నాడు. ఇక వేరే స్టార్స్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది ?, పైగా స్టార్ హీరో సినిమాలో అవకాశం ఇచ్చి మీ కెరీర్‌కు మేం సాయం చేస్తున్నాం, డబ్బుదేముంది అన్నట్లు మేకర్స్ మాట్లాడతారు. ఇలాంటి మాటలపై ప్రతిరోజూ నేను పోరాటం చేస్తున్నాను’ అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *