• వివాహం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన తాప్సీ
  • తన పెళ్లి గతేడాదే జరిగినట్లు వెల్లడి

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన వివాహం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చి ఇంటర్వ్యూలో తాప్సీ తన కెరీర్, వివాహం గురించి మాట్లాడింది. తనకు గతేడాదే పెళ్లయిందని ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2023 డిసెంబర్‌లో తాప్సీ తన ప్రియుడు, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకుట్లు తెలిపింది. వాస్తవానికి అందరూ తాప్సీకి మార్చి 23, 2024న వివాహం జరిగిందని అనుకుంటున్నారు. మథియాస్ బోను, తాప్సీ కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 23న ఉదయ్‌పుర్‌లో వీరికి పెళ్లి జరిగినట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని నటి అధికారికంగా ధృవీకరించలేదు.

READ MORE: DU Vacancy 2024: ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్‌తో సహా 137 పోస్టులకు రిక్రూట్‌మెంట్..

తాజాగా జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు తాప్సీ సమాధానం చెబుతూ.. “మా పెళ్లి గతేడాది డిసెంబర్‌లోనే జరిగింది. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఇది జరిగింది. త్వరలోనే మా వివాహ వార్షికోత్సవం రానుంది. అందరూ ఈ ఏడాది జరిగిందనుకుంటున్నారు. విషయాన్ని నేను బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి తెలిసేది కాదు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి సరైన బ్యాలెన్స్‌ ఉండాలని నిర్ణయించుకున్నాం. మా జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటపెడితే వృత్తిపరమైన విషయాలకు అది ఆటంకంగా మారుతుందని భావించాం. అదేవిధంగా వర్క్‌ లైఫ్‌లో సక్సెస్‌ లేదా ఫెయిల్యూరే అధికంగా పర్సనల్‌ లైఫ్‌పై ప్రభావం చూపిస్తే లేనిపోని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అది మాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వ్యక్తిగత విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పం.” అని ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

READ MORE: Jagtial Crime: భార్య, భర్తల చేతులు కట్టేసి, బాత్రూంలో బందించి దొంగతనం

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *