Reddy – Telugu Bell https://telugubell.com Bell Every News Fri, 18 Oct 2024 10:45:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 Love Reddy Movie Review in Telugu https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/ https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/#respond Fri, 18 Oct 2024 10:45:23 +0000 https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌టి రామస్వామి, గణేశ్ డిఎస్, రవి కాలబ్రహ్మ, వాణి గౌడ తదితరులు

దర్శకుడు : స్మరన్ రెడ్డి

నిర్మాతలు : సునంద బి రెడ్డి, హేమలతా రెడ్డి, రవీంద్ర జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి

సంగీత దర్శకుడు : ప్రిన్స్ హెన్రీ

సినిమాటోగ్రఫీ : కె.శివ శంకర వర ప్రసాద్, మోహన్ చారి, అష్కర్ అలీ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం “లవ్ రెడ్డి”. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) తనకు ముప్పై ఏళ్ళు వచ్చినా, నచ్చిన పిల్ల దొరకలేదు అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలో దివ్య (శ్రావణి రెడ్డి) ని చూసి ప్రేమలో పడతాడు. కానీ మనసు విప్పి ఆమెతో ఆ విషయం చెప్పలేక, ఆమె కూడా తనను ప్రేమిస్తోందని గుడ్డిగా నమ్ముతూ.. ఆమె వెంటే తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దివ్య కూడా నారాయణ రెడ్డితో క్లోజ్ గా ఉంటుంది. కానీ, ఒకరికి ఒకరు ప్రేమిస్తున్నా అని చెప్పుకోరు. అంతలో దివ్యకి పెళ్లి కుదురుతుంది. అసలు, దివ్య.. నారాయణ రెడ్డిని ప్రేమించిందా ?, లేదా ?, ప్రేమిస్తే ఎందుకు మరొకరితో పెళ్లికి ఒప్పుకుంది ?, దివ్య ప్రేమ కోసం నారాయణ రెడ్డి ఏం చేశాడు ?, చివరికి వీరిద్దరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ప్రేమిస్తూనే ప్రేమించట్లేదు అని నటిస్తూ దూరం అయితే.. ఆ ప్రేమికుడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?, తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫ్యామిలీ సీన్స్.. ఇవ్వన్నీ ఈ లవ్ రెడ్డి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన అంజన్ రామచంద్ర ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అంజన్ రామచంద్ర నటన బాగుంది.

హీరోయిన్ గా నటించిన శ్రావణి రెడ్డి నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. ఎన్‌టి రామస్వామి తో పాటు గణేశ్ డిఎస్ కూడా తమ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇక రవి కాలబ్రహ్మ, వాణి గౌడ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ లవ్ రెడ్డి కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు.

హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. ప్రేమను వ్యక్త పరచలేని హీరో పాత్రకి, అతనికి భిన్నమైన హీరోయిన్ పాత్రకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్లే చాలా స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు స్మరన్ రెడ్డి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

‘లవ్ రెడ్డి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/feed/ 0 401