Review – Telugu Bell https://telugubell.com Bell Every News Fri, 18 Oct 2024 10:45:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 Love Reddy Movie Review in Telugu https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/ https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/#respond Fri, 18 Oct 2024 10:45:23 +0000 https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌టి రామస్వామి, గణేశ్ డిఎస్, రవి కాలబ్రహ్మ, వాణి గౌడ తదితరులు

దర్శకుడు : స్మరన్ రెడ్డి

నిర్మాతలు : సునంద బి రెడ్డి, హేమలతా రెడ్డి, రవీంద్ర జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి

సంగీత దర్శకుడు : ప్రిన్స్ హెన్రీ

సినిమాటోగ్రఫీ : కె.శివ శంకర వర ప్రసాద్, మోహన్ చారి, అష్కర్ అలీ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం “లవ్ రెడ్డి”. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) తనకు ముప్పై ఏళ్ళు వచ్చినా, నచ్చిన పిల్ల దొరకలేదు అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలో దివ్య (శ్రావణి రెడ్డి) ని చూసి ప్రేమలో పడతాడు. కానీ మనసు విప్పి ఆమెతో ఆ విషయం చెప్పలేక, ఆమె కూడా తనను ప్రేమిస్తోందని గుడ్డిగా నమ్ముతూ.. ఆమె వెంటే తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దివ్య కూడా నారాయణ రెడ్డితో క్లోజ్ గా ఉంటుంది. కానీ, ఒకరికి ఒకరు ప్రేమిస్తున్నా అని చెప్పుకోరు. అంతలో దివ్యకి పెళ్లి కుదురుతుంది. అసలు, దివ్య.. నారాయణ రెడ్డిని ప్రేమించిందా ?, లేదా ?, ప్రేమిస్తే ఎందుకు మరొకరితో పెళ్లికి ఒప్పుకుంది ?, దివ్య ప్రేమ కోసం నారాయణ రెడ్డి ఏం చేశాడు ?, చివరికి వీరిద్దరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ప్రేమిస్తూనే ప్రేమించట్లేదు అని నటిస్తూ దూరం అయితే.. ఆ ప్రేమికుడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?, తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫ్యామిలీ సీన్స్.. ఇవ్వన్నీ ఈ లవ్ రెడ్డి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన అంజన్ రామచంద్ర ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అంజన్ రామచంద్ర నటన బాగుంది.

హీరోయిన్ గా నటించిన శ్రావణి రెడ్డి నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. ఎన్‌టి రామస్వామి తో పాటు గణేశ్ డిఎస్ కూడా తమ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇక రవి కాలబ్రహ్మ, వాణి గౌడ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ లవ్ రెడ్డి కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు.

హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. ప్రేమను వ్యక్త పరచలేని హీరో పాత్రకి, అతనికి భిన్నమైన హీరోయిన్ పాత్రకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్లే చాలా స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు స్మరన్ రెడ్డి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

‘లవ్ రెడ్డి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/feed/ 0 401
Janaka Aithe Ganaka Movie Review in Telugu, Suhas, Sangeerthana https://telugubell.com/janaka-aithe-ganaka-movie-review-in-telugu-html/ https://telugubell.com/janaka-aithe-ganaka-movie-review-in-telugu-html/#respond Sat, 12 Oct 2024 04:48:25 +0000 https://telugubell.com/janaka-aithe-ganaka-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 12, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సుహాస్, సంగీర్థన, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గోపరాజు రమణ తదితరులు.

దర్శకుడు : సందీప్ రెడ్డి బండ్ల

నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి

సంగీత దర్శకుడు : విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్

ఎడిటర్ :

సంబంధిత లింక్స్: ట్రైలర్

నటుడు సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

ప్రసాద్ (సుహాస్) సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన భార్య (సంగీర్థన విపిన్) తో అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ, వీరిద్దరూ చాలా సంతోషంగా చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే, పిల్లల్ని మాత్రం కనకూడదు అని ప్రసాద్ కఠినంగా నిర్ణయం తీసుకుంటాడు. బెస్ట్ లైఫ్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకూడదు అనేది ప్రసాద్ అభిప్రాయం. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రసాద్ భార్య నెల తప్పుతుంది. దీనికి ప్రధాన కారణం తాను కుటుంబ నియంత్ర కోసం వాడుతున్న కండోమ్ సరిగ్గా పని చేయలేదని ప్రసాద్ కి అర్థమవుతుంది. ఆ కంపెనీ పై కేసు వేస్తాడు ప్రసాద్. మరి ఆ కేసు ఏమైంది ?, ఈ కేసులో ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి ?, కోటి రూపాయిలు నష్టపరిహారం చెల్లించాలని పట్టుబడ్డిన ప్రసాద్ వాదన ఎలా సాగింది ?, అసలు ప్రసాద్ కేసుని గెలిచాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

నేటి సమాజంలో మధ్య తరగతి జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా నేటితరం జంటలు పెళ్లి తర్వాత పిల్లల్ని కనడానికి ఎందుకంతగా ఆలోచించాల్సి వస్తోందనే అంశాన్ని చాలా బాగా చెప్పారు. దర్శకుడు సందీప్‌ రెడ్డి ఫ్యామిలీ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది. ఓపెనింగ్ నుంచి సుహాస్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.

ముఖ్యంగా సుహాస్ పాత్ర, అతని తండ్రి గోపరాజు రమణ పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన సుహాస్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సుహాస్’ తన పాత్రను చాలా బాగా పండించారు. తండ్రి పాత్రలో గోపరాజు రమణ జీవించారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. అదేవిధంగా వెన్నెల కిషోర్ పాత్రతో పాటు ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి.

ఎమోషనల్ టోన్ లో నడిచిన భార్య పాత్రలో సంగీర్థన ఆకట్టుకుంది. జడ్జ్ గా రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

సందీప్ రెడ్డి బండ్ల తీసుకున్న కథాంశం, మరియు సుహాస్ – గోపరాజు రమణ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా అనిపిస్తోంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ సంగీర్థన పాత్రతో పాటు ‘ఎంజాయ్ కంపెనీ’ తాలూకు పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

అలాగే, హీరోహీరోయిన్ల మధ్య స్టార్టింగ్ లో వచ్చే సన్నివేశాలు కూడా ల్యాగ్ అయ్యాయి. నిజానికి పిల్లల్ని కంటే వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి, లేదా కనడమే మానేయాలనుకునే హీరో ఫిలాసఫీ బాగుంది. ఈ పాయింట్ చుట్టూ ఇంకా కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి.. హీరోహీరోయిన్ల ఫ్యామిలీస్ మధ్య కూడా బరువైన భావోద్వేగాలను పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా ఆకట్టున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘జనక అయితే గనుక’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఫన్ డ్రామాలో.. కొన్ని కామెడీ సీన్స్, మరియు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ బోరింగ్ ప్లేతో స్లోగా సాగడం, అలాగే కొన్ని సిల్లీ ట్రాక్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ యూత్ ని మెప్పించినా, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/janaka-aithe-ganaka-movie-review-in-telugu-html/feed/ 0 118
Viswam Movie Review in Telugu, Gopichand, Kavya Thapar https://telugubell.com/viswam-movie-review-in-telugu-html/ https://telugubell.com/viswam-movie-review-in-telugu-html/#respond Fri, 11 Oct 2024 15:37:11 +0000 https://telugubell.com/viswam-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : గోపీచంద్, కావ్య థాపర్, జిషు సేన్‌గుప్తా, శ్యామ్, నరేష్, సునీల్, ప్రగతి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ రాజ్ తదితరులు.

దర్శకుడు : శ్రీను వైట్ల

నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి.విశ్వ ప్రసాద్

సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : KV గుహన్

ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల

సంబంధిత లింక్స్: ట్రైలర్

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు.కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

గోపి (గోపీచంద్) తాను ప్రేమించిన సమేరా (కావ్య థాపర్) కోసం ఇటలీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో గోపి అసలు పేరు విశ్వం అని తెలుస్తోంది. అసలు విశ్వం, గోపిగా ఎందుకు మారాడు ?, పాప దర్శన ను చంపడానికి తీవ్రవాదులు ఎందుకు ప్రయత్నం చేశారు?, వారి నుంచి విశ్వం ఆ పాపను ఎలా సేవ్ చేశాడు ?, అసలు పాపకి తీవ్రవాదులకు మధ్య సంబంధం ఏమిటి ?, ఈ మధ్యలో విశ్వం జీవితంలో టర్న్ తీసుకున్న మలుపులు ఏమిటి ?, చివరకు ఆ తీవ్రవాదులను విశ్వం ఎలా అంతం చేశాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ విశ్వం సినిమాలో గోపీచంద్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ గోపీచంద్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. గోపీచంద్ నటించిన విధానం ఆకట్టుకుంది. కావ్య థాపర్ తో సాగిన లవ్ స్టోరీలోనూ గోపీచంద్ తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా కావ్య థాపర్ మెప్పించింది. గ్లామర్ సన్నివేశాలకు ఆమె న్యాయం చేసింది.

కీలక పాత్రలో నటించిన జిషు సేన్‌గుప్తా కూడా మెప్పించాడు. జిషు సేన్‌గుప్తా – సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. నరేష్, ప్రగతి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్ ల కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. వారి నటన కూడా బాగుంది. శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ రాజ్, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ముఖ్యంగా పృధ్వీ రాజ్ సీన్స్ అండ్ డైలాగ్స్ బాగానే పేలాయి.

మైనస్ పాయింట్స్ :

విశ్వం పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న శ్రీను వైట్ల, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే హీరో ఫ్లాష్ బ్యాగ్ ను ఇంకా బాగా చూపించాల్సింది.

కొన్ని కామెడీ సన్నివేశాలు తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు శ్రీను వైట్ల
మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి శ్రీను వైట్ల డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం బిలోవ్ యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.

సాంకేతిక విభాగం :

శ్రీను వైట్ల తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల తగ్గించాల్సింది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

విశ్వం’ అంటూ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. గోపీచంద్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు కామెడీ సీన్స్, అలాగే యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/viswam-movie-review-in-telugu-html/feed/ 0 55
Martin Telugu Movie Review, Dhruva Sarja, Vaibhavi Shandilya https://telugubell.com/martin-movie-review-in-telugu-html/ https://telugubell.com/martin-movie-review-in-telugu-html/#respond Fri, 11 Oct 2024 15:36:38 +0000 https://telugubell.com/martin-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ధృవ్ సార్జా, వైభవి సంధిల్య, అన్వేషి జైన్, నికిత్ ధీర్, అచ్యుత్ కుమార్

దర్శకుడు : ఏ పి అర్జున్

నిర్మాతలు : ఉదయ్ కే మెహతా

సంగీత దర్శకుడు : మణిశర్మ, రవి బస్రూర్(నేపథ్య సంగీతం)

సినిమాటోగ్రఫీ : సత్య హెగ్డే

ఎడిటర్ : ఎం ప్రకాష్, మహేష్ ఎస్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్


ఈ దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కన్నడ భారీ పాన్ ఇండియా చిత్రం “మార్టిన్” కూడా ఒకటి. ధృవ్ సార్జా నటించిన ఈ చిత్రం పలు కారణాలు చేత మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేసుకున్న ఈ చిత్రం మధ్యాహ్నం షోస్ తో మొదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక కథలోకి వస్తే.. పలు దేశాల్లో పేరు మోసిన మార్టిన్(?) అనే గ్యాంగ్ స్టర్ అసలు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అయితే పాకిస్తాన్ లో జరిగిన ఓ అటాక్ లో భారత నావికా దళానికి చెందిన అర్జున్(ధృవ్ సార్జా) అక్కడ పోలీసులకి దొరుకుతాడు. దీనితో వారు అతని మెమొరీ తుడిచెయ్యాలని డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తారు. దీనితో మెల్లగా అతను ఎవరో మర్చిపోతాడు. తర్వాత తనకి గతం ఎలా గుర్తొస్తుంది. అసలు ఆ మార్టిన్ ఎవరు? ఈ అర్జున్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ఇద్దరికీ మధ్యలో ఉన్న కొన్ని కంటైనర్లలో ఏముంది? చివరికి ఎవరు మార్టిన్? ఎవరు అర్జున్ అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ధృవ్ సార్జా డ్యూయల్ షేడ్స్ ని బాగా హ్యాండిల్ చేసాడని చెప్పాలి. మంచి మ్యాచో పర్సనాలిటీతో సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ లలో ఆకట్టుకున్నాడు అలాగే కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. అలాగే తన సరసన నటించిన వైభవి సంధిల్య మంచి లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే తనకి ధృవ్ సార్జా నడుమ కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపిస్తాయి.

ఇంకా నటి అన్వేషి జైన్ గతంలో తెలుగులో రామారావు ఆన్ డ్యూటీలో స్పెషల్ సాంగ్ లో చేసి మళ్ళీ ఈ సినిమాలో కనిపించారు. ఇందులో తన రోల్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇంకా ఇతర నటీనటులు తమ రోల్స్ మేరకు బాగానే చేశారు. ఇంకా సినిమా క్లైమాక్స్ పోర్షన్ తర్వాత వచ్చే ఒక్క సీన్ మాత్రం కొంచెం బెటర్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

చాలా నెలలు నుంచి కన్నడ సినిమాలో భారీ అంచనాలు ఉన్న సినిమాగా దీనిని హైప్ చేస్తూ ప్రమోట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కట్స్ అవీ చూసి కొందరు ఎగ్జైట్ అవ్వొచ్చు కానీ వారిని ఈ చిత్రం దారుణంగా నీరు గారుస్తుంది అని చెప్పాలి.

హీరోయిజంని బాగా ఎలివేట్ చేసేందుకు ఏంటీ నాన్సెన్స్ అనే రేంజ్ లో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఒకానొక టైం లో అయితే పరమ బోరింగ్ ఫీల్ కూడా వచ్చేస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అంత ఎగ్జైట్ చెయ్యవు. ట్రైలర్ లో చూసి ఏదో కొత్త రకం భారీ సినిమా చూడొచ్చు అనుకునేవారికి అదే రొటీన్ యాక్షన్ డ్రామాని ఇచ్చి వదిలారు. వీటితో ఆడియెన్స్ కి తల గోక్కోవడం తప్ప ఇంకేమి తోచదు.

అలాగే సినిమాలో ఒక్క పోస్ట్ క్లైమాక్స్ మినహా ఓవర్ బిల్డప్ గా అంతా సాగుతుంది. ఒక్కటంటే ఒక్క ఎగ్జైటింగ్ ఎలిమెంట్ లేకుండా ఈ సినిమా సాగదీతగా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే ఒక టైం తర్వాత సినిమా మరింత రొటీన్ గా అనిపించక కూడా మానదు. ఇంకా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. హీరోకి ఎలాగో మంచి మ్యాచో పర్సనాలిటీ ఉంది కాబట్టి ఇంకాస్త సాలిడ్ లెవెల్లో ఆ సీన్స్ ని చూపించినా యాక్షన్ పార్ట్ వరకు ఓకే అనిపించి ఉండొచ్చు. కానీ అవేవి ఉండకుండా సాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో చాలా చోట్ల నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ లెవెల్లో ఉన్నాయి. పెట్టిన భారీ ఖర్చు అంతా కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం వరస్ట్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ లో హీరో యాంటీ హీరో నడుమ ఫైట్ లో విఎఫ్ఎక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇక వీటితో పాటుగా మణిశర్మ పాటలు పర్వాలేదు కానీ రవి బసృర్ నేపథ్య సంగీతం ఎక్కదు. సినెమాటోగ్రఫీ బాగుంది గ్రాండ్ విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ విభాగంలో కే ఎం ప్రకాష్ చెయ్యడానికి ఏమీ లేదు.

ఇక ఈ చిత్రానికి కథ, దర్శకత్వం విషయానికి వస్తే యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కథ అందించారు. అయితే దేశ భక్తి నేపథ్యంలో ఏదో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశారు కానీ ఇది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఏపీ అర్జున్ దర్శకత్వం కథ ప్రకారం ఏదో మ్యానేజ్ చేశారు కానీ లేని పోనీ ఆర్భాటాలకు పోయి సినిమాని ఏమాత్రం ఎంగేజింగ్ గా లేకుండా తెరకెక్కించారు. వీటితో తన వర్క్ బిలో యావరేజ్ గానే ఉంటుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మార్టిన్” లో పెద్దగా విషయం లేదు. సినిమా మొత్తంలో కూడా ధృవ్ సార్జా నటుడుగా పర్వాలేదు అనిపిస్తాడు. కానీ ఎంత యాక్షన్ మూవీ లవర్స్ అయినా కూడా మార్టిన్ చూస్తే బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఒక్క మెప్పించే ఎలిమెంట్ కూడా ఆడియెన్స్ ని సినిమాలో ఎంగేజ్ చెయ్యలేదు. ముఖ్యంగా కథనంలో పస లేదు, చాలా చప్పగా సినిమా సాగుతుంది. వీటితో మార్టిన్ మాత్రం ఒక బోరింగ్ యాక్షన్ ఫ్లిక్ గా మిగిలిపోయింది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

]]>
https://telugubell.com/martin-movie-review-in-telugu-html/feed/ 0 57
Jigra Hindi Movie Review, Alia Bhatt, Vedang Raina https://telugubell.com/alia-bhatts-jigra-hindi-movie-review-in-telugu-html/ https://telugubell.com/alia-bhatts-jigra-hindi-movie-review-in-telugu-html/#respond Fri, 11 Oct 2024 15:35:40 +0000 https://telugubell.com/alia-bhatts-jigra-hindi-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ఆలియా భట్, వేదాంగ్ రైనా, మనోజ్ పాహ్వ, రాహుల్ రవీంద్రన్ తదితరులు

దర్శకుడు : వాసన్ బాల

నిర్మాతలు : కరణ్ జోహర్, ఆలియా భట్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సోమెన్ మిశ్రా

సంగీత దర్శకుడు : అచింత్ థాకర్, మన్‌ప్రీత్ సింగ్

సినిమాటోగ్రఫీ : స్వప్నిల్ ఎస్. సోనావానె

ఎడిటర్ : ప్రేర్ణా సైగల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా’ భారీ అంచనాల మధ్య నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతేమేర ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
సత్యభామ ఆనంద్(ఆలియా భట్) తన సోదరుడు అంకుర్ ఆనంద్(వేదాంగ్ రైనా)ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఉన్నత చదువుల కోసం తన కజిన్ హన్సి దావో తో కలిసి అంకుర్ మలేషియా వెళ్తాడు. అయితే, అక్కడ అనునకోని విధంగా డ్రగ్స్ కేసులో వారిద్దరికీ మరణశిక్ష పడుతుంది. ఓ భారీ సెక్యూరిటీ ఉన్న జైలులో వారిద్దరినీ ఖైదు చేస్తారు. దీంతో ఎలాగైనా తన సోదరుడిని తిరిగి ఇండియా తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది ఆలియా. మలేషియాలో ఆమెకు భటియా(మనోజ్ పహ్వ) పరిచయమవుతాడు. అతడి కుమారుడు కూడా జైలులో ఉంటాడు. దీంతో వారిద్దరికీ ముత్తు(రాహుల్ రవీంద్రన్) అనే ఎక్స్ కాప్ సహాయం చేస్తాడు. మరి వారిద్దరినీ జైలు నుంచి తప్పించారా..? దీని కోసం వారు ఎలాంటి ప్లాన్ వేశారు..? ఆలియా తన సోదరుడిని ఇండియాకి తీసుకువస్తుందా..? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
తన సోదరుడిని కాపాడుకోవాలనే అక్క పాత్రలో ఆలియా భట్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్‌లో ఆలియా ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి.

వేదాంగ్ రైనా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు. మనోజ్ పహ్వ, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:
ఆసక్తికరమైన కథనాన్ని ఆశించే ప్రేక్షకులను ‘జిగ్రా’ చిత్రం డిజప్పాయింట్ చేస్తుంది. ట్రైలర్ చూసిన వారికి సినిమా కథ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. సినిమాలోని పేస్, ఎమోషనల్ బాండింగ్ వంటి అంశాలు అసంపూర్తిగా కనిపిస్తాయి. దీంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.

ఆకట్టుకునే డైలాగులు, ఎంగేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు లేకపోవడంతో ఈ సినిమా రన్‌టైమ్ చాలా ఎక్కువగా అనిపించేలా చేయడమే కాకుండా.. ఎండ్ టైటిల్ కార్డ్ ఎప్పుడెప్పుడు పడుతుందా అని ప్రేక్షకులు చూసేలా చేస్తుంది.

సాంకేతిక విభాగం:
దర్శకుడు వాసన్ బాల ఓ చక్కటి ఎంగేజింగ్ కథనాన్ని ప్రెజెంట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆలియా భట్ వంటి స్టార్ ఉన్నప్పుడు మరింత పవర్‌ఫుల్ కథను రాసుకుని, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసుకుని ఉంటే, ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేది. ఈ చిత్రానికి రైటింగ్ చాలా వీక్‌గా ఉండటంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతారు.

స్వప్నిల్ ఎస్. సోనావానె సినిమాటోగ్రఫీ బాగున్నా.. ప్రేర్ణా సైగల్ ఎడిటింగ్ వర్క్ సినిమాకు డ్యామేజ్ చేసింది. అచింత్ థాకర్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, నిర్మాణ విలువలు గ్రాండ్‌గా కనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది.

తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే.. ఆకట్టుకునే అంశాలు, లోతైన ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో ‘జిగ్రా’ చిత్రం ఓ బోరింగ్ యాక్షన్ డ్రామాగా మిగలింది. ఆలియా భట్ పర్ఫార్మెన్స్ మినహా ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. ఆకట్టుకునే సినిమాను చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/alia-bhatts-jigra-hindi-movie-review-in-telugu-html/feed/ 0 59
Maa Nanna Superhero Movie Review in Telugu https://telugubell.com/maa-nanna-superhero-movie-review-in-telugu/ https://telugubell.com/maa-nanna-superhero-movie-review-in-telugu/#respond Fri, 11 Oct 2024 14:38:23 +0000 https://telugubell.com/maa-nanna-superhero-movie-review-in-telugu/

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

 

నటీనటులు : సుధీర్ బాబు, ఆర్నా వోహ్రా, సాయి చంద్, షయాజీ షిండే, ఝాన్సీ, శశాంక్

దర్శకుడు : అభిలాష్ కంకర

నిర్మాత : సునీల్ బలుసు

సంగీత దర్శకుడు : జై క్రిష్

సినిమాటోగ్రఫీ : సమీర్ కళ్యాణి

ఎడిటర్ : కుమార్ పి

సంబంధిత లింక్స్: ట్రైలర్


ఈ వారం దసరా కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. తన చిన్న వయస్సులోనే నాన్న ప్రకాష్ (సాయి చంద్)ని దూరం చేసుకున్న జాని(సుధీర్ బాబు) ఓ అనాథాశ్రమంలో పెరుగుతాడు. అయితే తనని గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి (షయాజి షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో జరిగే నష్టాలు జాని వల్లే అని నమ్మి మాట్లాడ్డం మనేస్తాడు. కానీ నాన్న అంటే అమితమైన ప్రేమ ఉన్న జాని తన తండ్రి చేసిన అన్ని అప్పులు, తప్పులు సరిదిద్దుతూ వస్తాడు. ఈ క్రమంలో షయాజిని పోలీసులు జైల్లో వేస్తారు. దీనికి కారణం ఏంటి? తను బయటకి రావాలంటే జానికి 1 కోటి రూపాయలు అవసరం అవుతాయి. వాటి కోసం తాను ఏం చేస్తాడు? ఈ క్రమంలో తనకి పరిచయమైన కొత్త వ్యక్తులు ఎవరు? తన నాన్నకి సంబంధించిన ఎలాంటి నిజాలు తెలుసుకుంటాడు? ఇంతకీ తన నాన్నని బయటకి తీసుకొస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. వాటి సరసన ఈ సినిమా కూడా నిల్చుంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ప్రతి ఎమోషనల్ బిట్ కూడా ఆడియెన్స్‌ని ఎంతగానో కదిలిస్తుంది. మరి వీటితో పాటు సుధీర్ బాబు ఒక నటుడిగా తనని మరింత ఇంప్రూవ్ చేసుకుంటున్నాడని చెప్పాలి.

తన నేచురల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చాలా బాగుంది. అలాగే ఆయనతో పాటు నటుడు షయాజి షిండే తన రోల్‌లో పర్ఫెక్ట్‌గా చేశారు. సుధీర్ బాబు, షయాజిల నడుమ పలు సన్నివేశాలు బాగున్నాయి. ఇక సినిమాలో సర్‌ప్రైజింగ్ ప్యాక్‌గా ఎవరైనా ఉన్నారంటే అది నటుడు సాయి చంద్ అని చెప్పొచ్చు. తన పాత్రకు సినిమా టైటిల్‌కి సరైన న్యాయం చేశారు.

మెయిన్‌గా సెకండాఫ్‌లో ఓ సన్నివేశం అయితే చప్పట్లు కొట్టిస్తుంది. అంత బాగా చేశారు. అలాగే తన కామెడీ టైమింగ్, సుధీర్ బాబుతో పలు సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే సినిమా క్లైమాక్స్‌కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎమోషనల్ ముగింపునివ్వడం చాలా బాగుంది.

ఇక వీటితో పాటుగా హీరోయిన్ ఆర్నా వోహ్రా బాగుంది. క్యూట్ లుక్స్‌తో ఉన్న కాసేపు డీసెంట్ నటనతో ఆకట్టుకుంటుంది. అలాగే సెకండాఫ్ లో నటుడు కొరియోగ్రాఫర్ రాజు సుందరం రోల్ బాగుంది. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు శశాంక్, దేవి ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మరీ అంత కొత్త లైన్‌ని మనం ఆశించలేం. కొంచెం రెగ్యులర్ లైన్‌తోనే సినిమా కనిపిస్తుంది. అలాగే సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉందని చెప్పాలి. సో కొంచెం సినిమా పికప్ అవ్వడానికి సమయం తీసుకుంది. అలాగే ఆ తర్వాత కొంతసేపటికే జరిగే సన్నివేశాలు చూస్తే కొంతమేర మనం సినిమాని ఊహించేయవచ్చు.

అంతే కాకుండా డీసెంట్ ఫస్టాఫ్ తర్వాత ఒక టెన్స్ వాతావరణం ఏర్పడుతుంది. కానీ దానిని అలా కంటిన్యూ చేయకుండా ఒక ఫన్ టోన్‌లో కొంతమేర నడిపించడం ఆ ఎమోషన్‌ని కొంచెం పక్కదారి పట్టించినట్టుగా అనిపిస్తుంది. ఇంకా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్, కథనం కొంచెం ‘వేదం’ సినిమాలో అల్లు అర్జున్ స్టోరీని తలపించవచ్చు. అలాగే కొంత సమయం తర్వాత హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. వీటితో కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్‌గానే అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీంలో మ్యూజిక్ వర్క్ ఇంప్రెసివ్‌గా ఉంది. కథనంలో కొన్ని సాంగ్స్ హత్తుకునేలా ఉన్నాయి. జై క్రిష్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ కల్యాణి బ్యూటిఫుల్ విజువల్స్‌ని ఈ సినిమాకి అందించారు. అలాగే అనీల్ కుమార్ పి ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు అభిలాష్ కంకర విషయానికి వస్తే.. తను ఓటీటీలో లూజర్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ సిరీస్ లో ఎంత సెన్సిబుల్ ఎమోషన్స్ ని తను పండించారో ఈ సినిమాలో కూడా ఎమోషన్స్ పరంగా ఒక బ్యూటిఫుల్ వర్క్‌ని అందించారని చెప్పాలి. లైన్ కొత్తదే కాకపోవచ్చు.. దానిని తాను ఆవిష్కరించిన విధానం మాత్రం మెప్పిస్తుంది. కీలకమైన ఎమోషన్స్‌ని తను చూపించిన విధానం, ఒక క్లారిటీ ఎండింగ్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్‌గా అనిపిస్తాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. “మా నాన్న సూపర్ హీరో” దసరా బరిలో వచ్చి ఆడియెన్స్‌కి ఒక మంచి ఎమోషనల్ రైడ్‌ని అందిస్తుందని చెప్పవచ్చు. లైన్ కొత్తగా అనిపించకపోవచ్చు కానీ సుధీర్ బాబు, సాయి చంద్ పాత్రలు సహా సినిమాలో ఎమోషన్స్ మిమ్మల్ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయవు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇంట్లో ప్రతీ తండ్రీ కొడుకలకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కొన్ని రెగ్యులర్ సీన్స్‌ని మినహాయిస్తే, ఈ పండగకి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.

Rating: 3/5

]]>
https://telugubell.com/maa-nanna-superhero-movie-review-in-telugu/feed/ 0 33
Vettaiyan Movie Review in Telugu, Rajinikanth, Amitabh Bachchan https://telugubell.com/vettaiyan-movie-review-in-telugu-html/ https://telugubell.com/vettaiyan-movie-review-in-telugu-html/#respond Thu, 10 Oct 2024 21:45:13 +0000 https://telugubell.com/vettaiyan-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, అభిరామి, దుషారా విజయన్, రోహిణి, రావు రమేష్ తదితరులు

దర్శకుడు : టి.జె. జ్ఞానవేల్

నిర్మాతలు : ఎ. సుభాస్కరన్

సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్. కతీర్

ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’. దర్శకుడు జ్ఞాన్‌వేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

అతియన్ (రజినీకాంత్) ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. అన్యాయం జరిగితే, ఆ అన్యాయం హద్దులు దాటిపోయింది అనిపిస్తే ఎన్ కౌంటర్ చేసైనా న్యాయం చేయాలని భావించే వ్యక్తి అతియన్. ఇలాంటి అతియన్ కి స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఓ సమస్య ద్వారా పరిచయం అవుతుంది. అన్యాయం పట్ల ఆమె చూపించిన ధైర్యానికి అతియన్ మెచ్చుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. స్కూల్ టీచర్ శరణ్య అతి దారుణంగా చంపబడుతుంది. అసలు ఆమెను చంపిన వ్యక్తి ఎవరు ?, ఈ హత్య కేసులో అతియన్ ఒక అమాయకుడిని ఎలా చంపాడు ?, చివరకు అసలు హంతకుడిని అతియన్ ఎలా కనిపెట్టాడు ?, ఈ మొత్తం కథలో నటరాజ్ (రానా) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

పవర్‌ ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజినీకాంత్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రజినీ స్టైల్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. అలాగే, రజినీకాంత్ మాస్ ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. సీరియస్ క్రైమ్స్ చేసి తప్పించుకునే చెడ్డవాళ్లకి న్యాయపరంగా మాత్రమే, శిక్ష పడాలని భావించే అమితాబ్ బచ్చన్ ఒకవైపు, హద్దులు దాటి అయినా న్యాయం చేయాలని భావించే రజనీకాంత్ పాత్ర మరోవైపు.. ఈ రెండు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. అమితాబ్ తన పాత్రలో ఒదిగిపోయారు.

రజినీకాంత్ వర్సెస్ రానా దగ్గుబాటి మధ్య సీన్స్ తో పాటు వారి మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. రానా కూడా చాలా బాగా నటించాడు. సెకండ్ హాఫ్ లో రానా పాత్రను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు అతని పాత్ర కూడా కనెక్ట్ అయ్యింది. ఇతర ప్రధాన పాత్రల్లో మంజు వారియర్, రితికా సింగ్ ఆకట్టుకున్నారు. అభిరామి, దుషారా విజయన్, రోహిణి, రావు రమేష్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

ఓ హత్యతో కథలో సీరియస్ టర్న్ తీసుకుని ఫస్ట్ హాఫ్ ని డ్రైవ్ చేయడం బాగుంది. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలిచింది. దర్శకుడు జ్ఞాన్‌వేల్ ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ను కూడా బాగానే ఎలివేట్ చేశాడు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తీసుకున్న మెయిన్ పాయింట్, మరియు ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సంఘర్షణ బాగా ఆకట్టుకున్నా… సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. పైగా కథను ఎలివేట్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ ల్యాగ్ లేకుండా, ఇంకా ఎమోషనల్ గా ఉండి ఉంటే బాగుండేది.

అలాగే, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ ను కూడా తగ్గించుకోవాల్సింది. ప్రధానంగా రానా పాత్రను లాజికల్ గా, బలమైన కాన్ ఫ్లిక్ట్ తో రాసుకుని ఉండి ఉంటే సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. అయితే, దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఇన్విస్టిగేషన్ సీన్స్ చాలా స్లోగా ఉండటం, అలాగే సెకండాఫ్ ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలిచాయి.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, సెకండ్ హాఫ్ ను ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలలోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. నిర్మాత ఎ. సుభాస్కరన్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాకెడ్ తో పక్కా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘వేట్టయన్’ సినిమాలో రజనీ స్టైల్ అండ్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. కాకపోతే, కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, మరియు సెకండాఫ్ ప్లే కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు క్రైమ్ యాక్షన్ డ్రామా ఇష్టపడేవారికి మాత్రమే కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/vettaiyan-movie-review-in-telugu-html/feed/ 0 83