Telugu – Telugu Bell https://telugubell.com Bell Every News Fri, 18 Oct 2024 10:45:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 Love Reddy Movie Review in Telugu https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/ https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/#respond Fri, 18 Oct 2024 10:45:23 +0000 https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌టి రామస్వామి, గణేశ్ డిఎస్, రవి కాలబ్రహ్మ, వాణి గౌడ తదితరులు

దర్శకుడు : స్మరన్ రెడ్డి

నిర్మాతలు : సునంద బి రెడ్డి, హేమలతా రెడ్డి, రవీంద్ర జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి

సంగీత దర్శకుడు : ప్రిన్స్ హెన్రీ

సినిమాటోగ్రఫీ : కె.శివ శంకర వర ప్రసాద్, మోహన్ చారి, అష్కర్ అలీ

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం “లవ్ రెడ్డి”. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) తనకు ముప్పై ఏళ్ళు వచ్చినా, నచ్చిన పిల్ల దొరకలేదు అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఈ క్రమంలో దివ్య (శ్రావణి రెడ్డి) ని చూసి ప్రేమలో పడతాడు. కానీ మనసు విప్పి ఆమెతో ఆ విషయం చెప్పలేక, ఆమె కూడా తనను ప్రేమిస్తోందని గుడ్డిగా నమ్ముతూ.. ఆమె వెంటే తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దివ్య కూడా నారాయణ రెడ్డితో క్లోజ్ గా ఉంటుంది. కానీ, ఒకరికి ఒకరు ప్రేమిస్తున్నా అని చెప్పుకోరు. అంతలో దివ్యకి పెళ్లి కుదురుతుంది. అసలు, దివ్య.. నారాయణ రెడ్డిని ప్రేమించిందా ?, లేదా ?, ప్రేమిస్తే ఎందుకు మరొకరితో పెళ్లికి ఒప్పుకుంది ?, దివ్య ప్రేమ కోసం నారాయణ రెడ్డి ఏం చేశాడు ?, చివరికి వీరిద్దరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ప్రేమిస్తూనే ప్రేమించట్లేదు అని నటిస్తూ దూరం అయితే.. ఆ ప్రేమికుడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?, తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫ్యామిలీ సీన్స్.. ఇవ్వన్నీ ఈ లవ్ రెడ్డి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన అంజన్ రామచంద్ర ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అంజన్ రామచంద్ర నటన బాగుంది.

హీరోయిన్ గా నటించిన శ్రావణి రెడ్డి నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. ఎన్‌టి రామస్వామి తో పాటు గణేశ్ డిఎస్ కూడా తమ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇక రవి కాలబ్రహ్మ, వాణి గౌడ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ లవ్ రెడ్డి కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు.

హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది. ప్రేమను వ్యక్త పరచలేని హీరో పాత్రకి, అతనికి భిన్నమైన హీరోయిన్ పాత్రకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్లే చాలా స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు స్మరన్ రెడ్డి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

‘లవ్ రెడ్డి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

]]>
https://telugubell.com/love-reddy-movie-review-in-telugu-html/feed/ 0 401
మరో ఓటిటిలోకి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ “శబరి” | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/varalaxmi-sarath-kumars-sabari-streaming-now-in-another-ott-html/ https://telugubell.com/varalaxmi-sarath-kumars-sabari-streaming-now-in-another-ott-html/#respond Fri, 18 Oct 2024 09:30:03 +0000 https://telugubell.com/varalaxmi-sarath-kumars-sabari-streaming-now-in-another-ott-html/

Published on Oct 18, 2024 3:00 PM IST

తన టాలెంట్ తో సౌత్ లో తమిళ్ సహా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటీనటుల్లో టాలెంటెడ్ వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు. మరి డిఫరెంట్ ట్రాక్ లో విలన్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్స్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తానే ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ థ్రిల్లర్ చిత్రం “శబరి” తో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ కాట్జ్ దర్శకత్వం వహించారు.

అయితే పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది. ఇలా డిజప్పాయింట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. మొదటిగా పాన్ ఇండియా భాషల్లో సన్ నెక్స్ట్ లో వచ్చిన ఈ చిత్రం నేటి నుంచి మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ఆహా లో కూడా ట్రై చేయవచ్చు.

]]>
https://telugubell.com/varalaxmi-sarath-kumars-sabari-streaming-now-in-another-ott-html/feed/ 0 399
‘వీరమల్లు’ కోసం ఒక్క గంటలో పవన్ స్పెషల్ సాంగ్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/pawan-kalyan-sung-a-special-song-in-hari-hara-veeramallu-html/ https://telugubell.com/pawan-kalyan-sung-a-special-song-in-hari-hara-veeramallu-html/#respond Fri, 18 Oct 2024 08:30:20 +0000 https://telugubell.com/pawan-kalyan-sung-a-special-song-in-hari-hara-veeramallu-html/

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా షూటింగ్స్ కి హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి.

మరి పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా దీనిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ సందర్భానుసారం పవన్ గొంతులో పాడాల్సిన సాంగ్ ఉంటుందట. మరి ఈ సాంగ్ ని పవన్ కేవలం ఒక గంటలో కంప్లీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది.

పవన్ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సెట్స్ లోనే రీ రికార్డింగ్ కోసం స్పెషల్ సెటప్ చేసి పవన్ తోనే ఒక గంటలో ఫినిష్ చేసేసారట. అలాగే ఆ సాంగ్ ఐడియా కూడా పవన్ దే అన్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్ అవుట్ పుట్ కూడా బాగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా కూడా ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పొచ్చు.

The post ‘వీరమల్లు’ కోసం ఒక్క గంటలో పవన్ స్పెషల్ సాంగ్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/pawan-kalyan-sung-a-special-song-in-hari-hara-veeramallu-html/feed/ 0 397
“గేమ్ ఛేంజర్” లో ఆ స్పెషల్ సాంగ్ కి ఏకంగా 20 కోట్లా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/massive-20-cr-for-game-changer-upcoming-song-html/ https://telugubell.com/massive-20-cr-for-game-changer-upcoming-song-html/#respond Fri, 18 Oct 2024 07:30:19 +0000 https://telugubell.com/massive-20-cr-for-game-changer-upcoming-song-html/

Published on Oct 18, 2024 1:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు సాంగ్స్ మంచి చార్ట్ బస్టర్ అయ్యాయి.

శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే ఎంత స్పెషల్ ఎంత భారీతనం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే గేమ్ ఛేంజర్ లో కూడా సాంగ్స్ కోసం కోట్ల డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేసినట్టు ఆ మధ్య నిర్మాత దిల్ రాజే తెలిపారు. ఇక ఇపుడు నెక్స్ట్ రానున్న సాంగ్ కోసం బజ్ తెలుస్తుంది.

దీనితో ఈ రానున్న మూడో సాంగ్ అది కూడా మెలోడికి ఏకంగా మేకర్స్ 20 కోట్లు వెచ్చించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సాంగ్ విజువల్స్ ఏ లెవెల్లో ఉండనున్నాయో అర్ధం చేసుకోవచ్చు. థమన్ అందించిన ఈ సాంగ్ ఈ అక్టోబర్ చివరిలో రానుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతుంది.

]]>
https://telugubell.com/massive-20-cr-for-game-changer-upcoming-song-html/feed/ 0 395
ఓటిటిలో వచ్చాక “మత్తు వదలరా 2” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/interesting-response-for-mathu-vadalara-2-after-ott-release-html/ https://telugubell.com/interesting-response-for-mathu-vadalara-2-after-ott-release-html/#respond Fri, 18 Oct 2024 06:31:35 +0000 https://telugubell.com/interesting-response-for-mathu-vadalara-2-after-ott-release-html/

రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర క్రేజీ హిట్ అయ్యినటువంటి మ్యాడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో యువ హీరో శ్రీసింహ అలాగే కమెడియన్ సత్య కాంబినేషన్ లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “మత్తు వదలరా 2” కూడా ఒకటి. మరి వీరి కలయికలో వచ్చిన పార్ట్ 2 కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకొని అదరగొట్టింది. ఇక రీసెంట్ గానే ఓటిటిలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం ఇక్కడా క్రేజీ రెస్పాన్స్ ని ఆడియెన్స్ నుంచి అందుకుంటుంది.

మెయిన్ గా సినిమాలో మీమ్ స్టఫ్ రితీష్ రానా టేకింగ్ పై కొన్ని మైనర్ డీటెయిల్స్ సోషల్ మీడియా ఆడియెన్స్ నడుమ వైరల్ గా మారుతున్నాయి. అలాగే కమెడియన్ సత్యపై కూడా ఎన్నో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలా మరోసారి అయితే ఈ చిత్రం ఆడియెన్స్ కి బాగానే ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో కనిపించగా కాల భైరవ సంగీతం అందించాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

The post ఓటిటిలో వచ్చాక “మత్తు వదలరా 2” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/interesting-response-for-mathu-vadalara-2-after-ott-release-html/feed/ 0 394
“గజినీ 2” పై ఇంట్రెస్టింగ్ టాక్.! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/interesting-talk-in-suriya-amir-khan-ghajini-2-html/ https://telugubell.com/interesting-talk-in-suriya-amir-khan-ghajini-2-html/#respond Fri, 18 Oct 2024 05:54:18 +0000 https://telugubell.com/interesting-talk-in-suriya-amir-khan-ghajini-2-html/

కోలీవుడ్ సినిమా స్టార్ హీరోస్ లో టాలెంటెడ్ నటుడు సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా నటించిన ఎన్నో బిగ్ హిట్ చిత్రాల్లో అందులోని కొన్ని ఐకానిక్ పాత్రల్లో “గజినీ” కూడా ఒకటి. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చెయ్యగా అక్కడ రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.

స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఏ ఆర్ మురుగదాస్ నే చేసిన ఈ చిత్రంకి సీక్వెల్ పై కొన్నాళ్ల కితం పలు రూమర్స్ వచ్చాయి. అలాగే ఈ రూమర్స్ ఇపుడు నిజం అయ్యేలా ఉన్నాయని చెప్పాలి. మురుగదాస్ తమిళ్ సహా హిందీలో గజినీ 2 తియ్యనున్నారని టాక్ వైరల్ గా మారింది. అలాగే సూర్య కూడా హింది గజినీ పార్ట్ 2లో అమీర్ తో కనిపిస్తాను అని కంగువా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపినట్టుగా ఓ స్టేట్మెంట్ కూడా వైరల్ గా మారింది. మరి ఈ క్రేజీ సీక్వెల్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పాలి.

The post “గజినీ 2” పై ఇంట్రెస్టింగ్ టాక్.! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/interesting-talk-in-suriya-amir-khan-ghajini-2-html/feed/ 0 392
Salaar: మళ్ళీ “సలార్” మ్యానియా షురూ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/once-again-prabhas-salaar-mania-started-in-bookings-html/ https://telugubell.com/once-again-prabhas-salaar-mania-started-in-bookings-html/#respond Fri, 18 Oct 2024 04:32:40 +0000 https://telugubell.com/once-again-prabhas-salaar-mania-started-in-bookings-html/

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ సమయం కంటే రిలీజ్ అయ్యి ఓటిటిలో వచ్చాక మంచి రిపీట్స్ పడ్డాయని చెప్పాలి. అలా ఈ భారీ సినిమా ఇప్పుడు మంచి కల్ట్ ఫాలోయింగ్ ని తెచ్చుకోగా ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేసేందుకు సలార్ దేవరతా రైజర్ సిద్ధం అయ్యాడు.

ఈసారి ప్రభాస్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కి ఈ చిత్రం వస్తుండగా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. దీనితో ఈ చిత్రం మళ్ళీ మ్యానియా చూపిస్తుంది అని చెప్పాలి. మరి సింగిల్ స్క్రీన్స్ లో అయితే బుకింగ్స్ శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి. దీనితో మరోసారి సలార్ మ్యానియా గట్టిగా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే త్వరలోనే పార్ట్ 2 కూడా మొదలు కానుంది.

The post Salaar: మళ్ళీ “సలార్” మ్యానియా షురూ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

]]>
https://telugubell.com/once-again-prabhas-salaar-mania-started-in-bookings-html/feed/ 0 390
“RRR” సెన్సేషన్.. ఆ థియేటర్ లో 21 నెలల రన్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/rrr-movie-sensation-is-that-run-in-1-year-9-months-in-japan-theater-html/ https://telugubell.com/rrr-movie-sensation-is-that-run-in-1-year-9-months-in-japan-theater-html/#respond Fri, 18 Oct 2024 03:33:39 +0000 https://telugubell.com/rrr-movie-sensation-is-that-run-in-1-year-9-months-in-japan-theater-html/

Published on Oct 18, 2024 9:03 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ లని గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుగా మార్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. మరి ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది కాగా ఈ చిత్రం ఎన్నో వండర్స్ సెట్ చేసింది. అయితే ఈ సినిమా మన దేశంలో రన్ ఏమో కానీ జపాన్ దేశంలో అయితే మన దగ్గర కంటే భారీ రన్ ని చూసింది.

అక్కడ ఏకంగా సంవత్సరాలు తరబడి రన్ అవుతుంది. అలా లేటెస్ట్ గా మేకర్స్ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. జపాన్ లోని ఒక హిస్టారికల్ థియేటర్ లో RRR సినిమా ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు నిర్విరామంగా రన్ కావడం ఎంతో ఆనందంగా ఒకింత ఎమోషనల్ గా కూడా ఉందని వారు తెలుపుతున్నారు. మరి ఈ రేంజ్ లో ఓ భారతీయ సినిమా అందులోని మన తెలుగు సినిమా రన్ కావడం అనేది చిన్న విషయం అయితే కాదని చెప్పాలి.

]]>
https://telugubell.com/rrr-movie-sensation-is-that-run-in-1-year-9-months-in-japan-theater-html/feed/ 0 388
“రోలెక్స్” కి సూర్య మరో సినిమాకి లింక్? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/suriya-another-project-linked-rolex-html/ https://telugubell.com/suriya-another-project-linked-rolex-html/#respond Fri, 18 Oct 2024 02:35:12 +0000 https://telugubell.com/suriya-another-project-linked-rolex-html/

Published on Oct 18, 2024 8:05 AM IST

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఫిల్మోగ్రఫీ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు సూర్య ఇప్పుడు వరకు చేస్తూ వచ్చి తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ కి అలరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” తో తాను వస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరి ఈ కామెంట్స్ లో భాగంగా తన నుంచి రానున్న క్రేజీ ప్రాజెక్ట్ “రోలెక్స్” పై చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. రోలెక్స్ సినిమాకి ఇది వరకే తాను చేసిన మరో సినిమాకి కనెక్షన్ ఉంది అని సూర్య రివీల్ చేశారు. అయితే తనది మరో సినిమా అంటే ఖచ్చితంగా “విక్రమ్” అయితే కాదు అని చెప్పొచ్చు. మరి ఆ సినిమా ఏంటి రోలెక్స్ తో ఎలా సంబంధం కుదిరింది అనేది లోకేష్ కనగరాజ్ సూర్యకే తెలియాలి. మరి సూర్య చేసిన గత చిత్రాల్లో డ్రగ్స్ రిలేటెడ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. మరి వాటితో ఏమన్నా కనెక్షన్ ఉందా అనేది వేచి చూడాలి.

]]>
https://telugubell.com/suriya-another-project-linked-rolex-html/feed/ 0 386
ఇది మీ ఇంటి లగ్గం.. తప్పకుండా రావాలే అంటున్న దర్శకుడు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings https://telugubell.com/director-ramesh-cheppaala-on-laggam-release-html/ https://telugubell.com/director-ramesh-cheppaala-on-laggam-release-html/#respond Fri, 18 Oct 2024 02:34:20 +0000 https://telugubell.com/director-ramesh-cheppaala-on-laggam-release-html/

Published on Oct 18, 2024 8:04 AM IST


రచయితగా అలాగే దర్శకుడిగా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా ద్వారా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న రమేష్ చెప్పాల. మీడియాతో మాట్లాడుతూ….
“భీమదేవరపల్లి బ్రాంచి చేసాక నెక్స్ట్ ఎలాంటి కథ చెయ్యాలి అనే విషయంలో చాలా ఆలోచించాను.ఆ ఆలోచనల్లోనుండి పుట్టిన కథ లగ్గం, తెలంగాణ కల్చర్లో లగ్గం అనేది ఎన్నో ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. తెలంగాణ లగ్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఎమోషన్స్ ని, కల్చర్ ని కలిపి తెరమీదకు తీసుకురావాలి అనుకున్నాను.

చిన్నతనం నుండి నా చుట్టూ చూసిన ఎన్నో క్యారెక్టర్లనీ ఈ కథలో రాసుకున్నా మొదట లగ్గం అని టైటిల్ అనుకున్నప్పుడు టైటిల్ చెప్పగానే చాలా మంది కనెక్ట్ అయ్యారు. టైటిల్ కి అంత రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. ఇది ప్రతి ప్రవాస భారతీయులు &సాఫ్టువేర్ ఇంజనీర్, రైతు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అలాగే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ కధలో ఎమోషన్స్ ఒక పెయింటింగ్ లా పోట్రెయిట్ చేసాను.

లగ్గం ఐడియా అనుకున్నప్పుడు ఈ సినిమానీ ఒక ట్రూత్ తో ఎండ్ చెయ్యాలి అనుకున్నాను, అదే చేసాను. క్లైమాక్స్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. ‘ఈ లగ్గం అరిటాకులో విందుభోజనంలా ఉండబోతుంది’. పెళ్ళైన ప్రతీ ఒక్కరికీ వాళ్ళ లగ్గాన్ని వాళ్ళకి మరోసారి గుర్తుచేస్తాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎలా చేసుకోవాలో… ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాను. నేను లగ్గం అనే ఒక ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను బంధువులుగా మార్చబోతున్నాను. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని దీవించండి. అందరూ ఆహ్వానితులే అంటూ సినిమా విషయంలో కామెంట్స్ చేశారు.

]]>
https://telugubell.com/director-ramesh-cheppaala-on-laggam-release-html/feed/ 0 403