
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాలతోనే స్టార్డు రాణించిపోతున్నాడు. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా పరిచయం అయిన విజయ్, అర్జున్ రెడ్డి హిట్‌తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. తర్వాత అనేక సినిమాలు చేస్తూ తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు.
ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
అయితే, చాలా మందికి తెలియకపోయినా, విజయ్ దేవరకొండ, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటించిన యాడ్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమన్నా కెరీర్ ప్రారంభంలో చేసింది ఈ యాడ్‌లో విజయ్ కూడా కాలేజీ కుర్రాడిలా కనిపించి, అభిమానులను ఆకట్టుకున్నాడు. సెల్ ఫోన్ బ్రాండ్ సెల్కాన్ ప్రమోషన్ కోసం రూపొందించిన ఈ యాడ్‌లో ఇద్దరూ చాలా యంగ్ లుక్ లో ఉన్నారు.
ఈ వీడియోను విజయ్, తమన్నా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా చర్చలు జరుగుతున్నాయి. విజయ్ కెరీర్ మొదలైన దశలో ఇలా సహకరించిన యాడ్స్, ప్రస్తుతం అతని స్టార్ డమ్‌ను మరింత మెరుపుమనిపిస్తున్నాయి.