Tamannaah and Vijay Varma breakup rumors
Tamannaah and Vijay Varma breakup rumors

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విడిపోయారని వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట సంబంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమా? లేక సినిమా ప్రమోషన్ స్టంట్ మాత్రమేనా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. తమన్నా ప్రస్తుతం ఓదెలా 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

“లస్ట్ స్టోరీస్ 2” షూటింగ్ సమయంలో తమన్నా – విజయ్ వర్మ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వారి పెళ్లి వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు విడిపోయారనే ప్రచారం ఊపందుకుంది. “తమన్నా లాంటి అందమైన అమ్మాయిని బ్రేకప్ ఎలా చెప్పావ్ బ్రో?” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు తమన్నా కానీ, విజయ్ వర్మ కానీ ఈ విషయంపై స్పందించలేదు.

ఈ వార్తలు నిజమా? పుకార్లా? అనే దానిపై క్లారిటీ రావాలంటే వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. లేదా ఏదైనా ఈవెంట్‌లో కలసి కనిపిస్తే ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడుతుంది. ప్రస్తుతం అభిమానులు వీరి సంబంధంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

ఇంతకుముందు కూడా తమన్నా అనేక రూమర్స్‌కి గురైంది. కానీ ఈసారి అభిమానుల కన్‌ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తోంది. విజయ్ వర్మ కూడా తన సామాజిక మాధ్యమ ఖాతాలలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మరి ఇదంతా నిజమేనా? లేక ఇంకో ప్రచారమేనా? అనేది త్వరలోనే తేలనుంది!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *