
ప్రముఖ నటి తమన్నా భాటియా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోనుందని ప్రచారం సాగింది. కానీ, తాజాగా విదురంగా మారినట్లు సమాచారం.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తమన్నా ప్రేమ, రిలేషన్‌షిప్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. “ప్రేమలో షరతులు ఉండకూడదు, లేకపోతే అది వ్యాపార లావాదేవిలా మారుతుంది” అని చెప్పింది. ఒకరి ఆలోచనలను, భావాలను నియంత్రించడం ప్రేమ కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు.
“నేను ఒంటరిగా ఉన్నప్పుడే మరింత ఆనందంగా ఉంటున్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వామిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు విజయ్ వర్మతో విడిపోయిందనే ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి.
తమన్నా వ్యాఖ్యలపై ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, సోషల్ మీడియాలో ఈ బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగా వీరు విడిపోయారా? లేక కేవలం ప్రచారమా? అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.