
సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, హ్యాపీ డేస్, 100% లవ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగచైతన్యతో చేసిన 100% లవ్ సినిమా తమన్నాకు ఓవర్‌నైట్ స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు అందుకుంది.
తాజాగా, తమన్నా బాలీవుడ్ కెరీర్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. వీరి వెడ్డింగ్ రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే, అనూహ్యంగా తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ బ్రేకప్ రూమర్ల మధ్య తమన్నా తన సరికొత్త స్టన్నింగ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. బ్లాక్ ట్రెండీ డ్రెస్‌లో తళుక్కుమని మెరిసిన ఈ బ్యూటీ ఆకర్షణీయమైన స్టైల్ తో కనిపించింది. తాజా ఫోటోషూట్‌లో గ్లామర్ టచ్ తో తమన్నా చేసిన పోజులు, అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తమన్నా వెబ్ సిరీస్‌లతో పాటు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. టాలీవుడ్లో సోలో హీరోయిన్గా అవకాశాలు తగ్గినప్పటికీ, స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్‌తో తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. తమన్నా కెరీర్లో మరో కీలక మలుపు తిరిగిందా? అని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది!