సూర్య రెండేళ్ల కష్టానంత కంగువా రిజల్ట్ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. కరోనా టైంలో కూడా ఓటీటీతో పలకరించిన ఈ స్టార్ హీరో ‘ఈటీ’ తర్వాత పూర్తిగా కంగువాకు కమిటయ్యాడు. ఈ సినిమాకు ఎంత స్టఫ్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. గ్యాప్‌తో వస్తే జనాలకు క్యూరియస్, ఎగ్జైంటీ కలిగించొచ్చు అనుకున్నారు తప్ప కంటెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ పట్టించుకోరన్న విషయాన్ని మర్చిపోయాడు సూర్య. లాస్ట్‌కి ఖంగుతినింది కంగువా.
Also Read : UnstoppableS4 : అన్ స్టాపబుల్ సంక్రాంతి హీరోలు ప్రోమో సూపర్బ్
సూర్య 2023 లో ఒక్కటంటే ఒక్క మూవీని తీసుకురాలేదు. గ్యాప్ వస్తే.. ఆడియన్స్ విపరీతంగా బజ్ వచ్చేస్తుందనుకున్న కంగువా స్ట్రాటజీ వర్క్ కాకపోవడంతో ప్లాన్ మార్చాడు. తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో డార్లింగ్ ప్రభాస్‌ను ఫాలో అవుతున్నాడు. అదేంటంటే ఇక ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని, వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టాయాలని పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ కోసం ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ లో ఇన్నర్ టాక్. అందుకే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను షురూ చేస్తున్నాడు. అందుకోసం క్రేజీ డైరెక్టర్లతో సినిమాలను వర్కౌట్ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 సెట్స్ పై ఉండగానే ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో సూర్య 45ని పట్టాలెక్కించాడు. రీసెంట్లీ సెట్స్ పైకి వెళ్లింది ఈ ప్రాజెక్ట్. నెక్ట్స్ ఇయర్ ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నాడు. ఇవే కాదు మలయాళ డైరెక్టర్ అమల్ నీరద్, ఇటు వెంకీ అట్లూరీ చెప్పిన స్టోరీస్ విన్నట్లు సమాచారం.