మరాఠీ సినిమా తప్తపది (Taptapadi) అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన “దృష్టిదాన్” కథ ఆధారంగా రూపొందించిన ఒక భావోద్వేగ రొమాంటిక్ డ్రామా. సచిన్ బలరామ్ నాగర్‌గోజే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్యప్ పరులేకర్, వీణా జామ్‌కర్, శృతి మరాఠే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2014 మార్చి 28 న విడుదలై, ఇప్పుడు Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలో మాధవ్ (Madhav) & మీరా (Meera) చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటారు. వారి పెళ్లి సంతోషంగా సాగుతుండగా, అనుకోకుండా మీరా కంటికి సమస్య ఏర్పడుతుంది. కొన్ని రోజుల్లో ఆమె పూర్తిగా చూపు కోల్పోతుంది. అయితే, మాధవ్ తన భార్యను ప్రేమతో చూసుకుంటూనే ఉంటాడు. కానీ, అతడి మేనత్త సునంద (Sunanda) అనే అందమైన అమ్మాయితో రెండో పెళ్లి చేసేందుకు ఒత్తిడి చేస్తుంది.
మాధవ్ మొదట్లో ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నా, సునంద అందానికి ఆకర్షితుడవుతాడు. తన భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరి చివరికి మాధవ్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? అతడి ప్రేమ నిజమైనదేనా లేదా? ఈ కథ నైతిక విలువలు, ఆత్మీయ ప్రేమ, మోసం, బాధలను అందంగా చూపిస్తుంది.
ఇలాంటి భావోద్వేగ రొమాంటిక్ సినిమాలను మీరు ఇష్టపడతే, తప్తపది తప్పక చూడండి! ఇప్పుడే Amazon Prime Video లో స్ట్రీమ్ చేయండి.