యానిమల్ సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ డియోల్. ఇప్పుడీ బాలీవుడ్ నటుడు తెలుగులో అడుగుపెడుతున్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ సినిమాలో విలన్ గా ఆయన కనిపించబోతున్నారు. బాబీ డియోల్ సెట్స్ లోకి అడుగుపెట్టిన ఫొటోను మూవీ టీమ్ షేర్ చేసింది.

దర్శకుడు బాబి, నిర్మాత నాగవంశీతో కలిసి ఆయన ఫొటో తీసుకున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఉర్వశీ రౌటేలా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.