
సినీ ఇండస్ట్రీలో రాణించాలని, స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ అందరికీ అదృష్టం కలిసి రావడం అంత ఈజీ కాదు. అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో చాలా మంది హీరోయిన్లు వెనుదిరుగుతున్నారు. కొంత మంది బిజినెస్‌లోకి వెళితే, మరికొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవుతున్నారు. కానీ, ఓ యంగ్ హీరోయిన్ మాత్రం తన సినీ కెరీర్ కోసం వెయిట్ చేస్తూ, అవకాశాలు రాకపోవడంతో భావోద్వేగానికి గురైంది.
తెలుగులో కేవలం నాలుగు సినిమాలు చేసిన ఈ అందాల తార, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలు వచ్చినా, తొలి హిట్ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో, టాలీవుడ్ నుంచి పూర్తిగా కనుమరుగై ఇతర భాషల్లో అదృష్టం పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా స్టార్‌గా ఎదగలేకపోయింది. ఈ బ్యూటీ మరెవరో కాదు శాన్వీ శ్రీవాస్తవ.
“లవ్లీ” అనే సినిమా గుర్తుందా? ఆది సాయి కుమార్ హీరోగా, బీఏ జయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందులో హీరోయిన్‌గా నటించిన శాన్వీ, తన క్యూట్ పర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత సుశాంత్‌తో అడ్డా, మంచు విష్ణుతో రౌడీ, మళ్లీ ఆదితో ప్యార్ మే పడిపోయానే చిత్రాల్లో నటించింది. అయితే, ఈ సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో, కన్నడ చిత్ర పరిశ్రమకు వెళ్లిన ఆమె, అక్కడ కూడా మెగా స్టార్‌గా నిలవలేకపోయింది.
ఒక ఇంటర్వ్యూలో శాన్వీ తన బాధను పంచుకుంది. “తెలుగులో నాకు అవకాశాలు రావడం లేదు. ఎందుకు ఛాన్స్‌లు ఇవ్వట్లేదో అర్థం కావడం లేదు” అంటూ స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం కన్నడలోనే కొనసాగుతున్న ఆమె, అక్కడ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు చేయడం లేదు. అభిమానులు మాత్రం ఆమెకు మంచి అవకాశం రావాలని ఆశిస్తున్నారు.