- తెలుగు సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్
- 165 నిమిషాల నిడివితో రాబోతున్న మూవీ
- తెలుగు పదాలతో కూడా టైటిల్ పెట్టాలన్న సెన్సార్ బోర్డు
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ఇద్దరి కెరీర్ లో చాలా కీలకమైన మూవీగా గేమ్ ఛేంజర్ రాబోతుంది. ప్రేక్షకులు ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మొదలు పెట్టిన నాటి నుంచే ఈ సినిమా హిట్ కావాలని మెగా ఫ్యాన్స్ అభిమానులు ఆశిస్తన్నారు. కానీ సినిమా అలా ఆలస్యం అవుతూ వచ్చి ఎట్టకేలకి ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది.
Read Also:Congress MLA: 15 అడుగుల స్టేజ్‌పై నుంచి పడిపోయిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే..
మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తి అయింది. ఈ సినిమా 165 నిమిషాల నిడివితో రాబోతున్నట్లుగా ఖరారు అయింది. అయితే ఈ సెన్సార్ లో ఒక విషయంలో మాత్రం బోర్డు వారు యూనిట్ ని చురక అంటించిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలకి తెలుగు పదాలతో పేర్లు తక్కువ రావడమే కాకుండా తెలుగు అక్షరాల్లో ఈ ఇంగ్లీష్ టైటిల్ ని కూడా పొందుపరచడం లేదు.
Read Also:Kangana Ranaut : నేడు కోర్టులో హాజరుకానున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఎందుకంటే ?
ఇంకా చెప్పాలంటే పలు చిత్రాలకి కనీసం సినిమా మొదట్లో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారనే చెప్పాలి. ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డుని తెలుగులో కూడా పెట్టాలని సెన్సార్ బోర్టు సూచించింది. దీనితో తెలుగు వెర్షన్ రిలీజ్ లో కూడా థియేట్రికల్ గా ఇంగ్లీష్ టైటిల్ తోనే ప్లాన్ చేసిన టీం నిర్లక్ష్యానికి తెలుగు సెన్సార్ బోర్డు కాస్త చురకలంటించిందనే చెప్పాలి.