గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో, ఇద్దరి కెరీర్ లో కూడా 15వ ప్లాన్ చేసిన తాజా అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. అయితే ఎన్నో అంచనాలు ఈ సినిమా మొదలు పెట్టిన నాటి నుంచే నెలకొన్నాయి. కానీ సినిమా అలా ఆలస్యం అవుతూ వచ్చి ఎట్టకేలకి ఈ సంక్రాంతి విడుదలకి రాబోతుంది.
మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ సినిమా 165 నిమిషాల నిడివితో రాబోతున్నట్టుగా దీనితో ఖరారు అయ్యింది. అయితే ఈ సెన్సార్ లో ఒక విషయంలో మాత్రం బోర్డు వారు యూనిట్ ని చురక అంటించారని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలకి తెలుగు పదాలతో పేర్లు తక్కువ కావడమే కాకుండా తెలుగు అక్షరాల్లో ఈ ఇంగ్లీష్ టైటిల్ ని కూడా పొందు పరచడం లేదు.
ఇంకా చెప్పాలంటే పలు చిత్రాలకి కనీసం సినిమా ఆరంభంలో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారు. ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డుని తెలుగులో కూడా పెట్టాలని సూచించారు. దీనితో తెలుగు వెర్షన్ రిలీజ్ లో కూడా థియేట్రికల్ గా ఇంగ్లీష్ టైటిల్ తోనే ప్లాన్ చేసిన టీం నిర్లక్ష్యానికి తెలుగు సెన్సార్ బోర్డు నుంచి చుక్కెదురైంది అని చెప్పాలి.
The post “గేమ్ ఛేంజర్” టీం నిర్లక్ష్యానికి ‘తెలుగు’ సెన్సార్ బోర్డు సూచన first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.