
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ విజయాన్ని సాధించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కామెడీ, ఎమోషన్, వెంకటేశ్ స్టైల్ టైమింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.
ఇప్పటి వరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు నిలవడం కష్టమవుతుండగా, సంక్రాంతికి వస్తున్నాం 50 రోజులు పూర్తి చేయడం సెన్సేషన్ అని చెప్పాలి.
ఇటీవలే ఈ సినిమా ప్రముఖ ఛానెల్ జీ 5 లో టెలికాస్ట్ చేయగా, అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, ఓటీటీలో ఈ సినిమా 12 గంటల్లోనే 13 లక్షల వ్యూస్ సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. జీ 5 ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సినిమా విజయంతో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. వెంకటేశ్ స్టైల్, కామెడీ టైమింగ్ మళ్లీ తెరపై చూడటానికి అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ ఏడాది కామెడీ ఎంటర్‌టైనర్‌గానే కాదు, బిగ్గెస్ట్ ఫ్యామిలీ హిట్‌గా కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచిపోనుంది.