- ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజైన తంగలాన్
- చాలా నెలలుగా ఓటీటీ రిలీజ్ సస్పెన్స్
- మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా వచ్చిన చిత్రం తంగలాన్. అక్కడి బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే తెరపై కళ్ళకి కట్టినట్టు తెరకెక్కించాడు దర్శకుడు పా రంజిత్.
కాగా తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ కు ముందు కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. ఒకానొక టైమ్ లో తంగలాన్ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంది అనే టాక్ కూడా వినిపించింది. కానీ అవేవి వాస్తవం కాదని నిర్ ఫ్లిక్స్ మరోసారి వెల్లడిస్తూ తంగలాన్ ఓటీటీ స్టీమింగ్ డేట్ ను ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమాను ఈ మంగళవారం అనగా నేటి నుండి స్ట్రీమింగ్ తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందిలోను ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్. ఏదైతే ఏమి ఇంక అసలు ఓటీటీ రిలీజ్ కాదు అనుకున్న సినిమా మొత్తానికి ఓటీటీ రిలీజ్ అయింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.