మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘ రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని సహకారాలు అందిచారు. కానీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారనే వార్త ఇప్పుడే తెలిసింది. ఆ ఇద్దరు యువకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ రెండు కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున సహాయం చేసి ఆదుకుంటాను. ఆ రెండు కుటుంబాలకు అండగా ఉంటాము. వారికి కావాల్సిన సాయం చేస్తాము. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాకు చాలా భాదగా ఉంటుంది. రాజమండ్రి ఈవెంట్ కు అన్ని రకాలుగా సాకారం అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు.