- గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్
- కాలేజ్ అమ్మాయిగా క్యూట్ లుక్స్ లో రష్మిక
- విజయ్ దేవరకొండ కవితతో వాయిస్ ఓవర్
Girlfriend : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక తన సత్తాను చాటుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా ‘పుష్ప 2’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయేలా చేసుకుంది. యానిమల్ సినిమాతోనే రష్మిక మందన నటనపరంగా బాలీవుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న.. తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది.
Read Also:PrabhasHanu : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కీలక అప్‌డేట్
ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, మారుతి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో విజయ్ వాయిస్ ఓవర్ తో రష్మిక క్యారెక్టర్ ను ఒక కవిత తరహాలో హైలెట్ చేశారు.
Read Also:Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు
ఈ టీజర్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్యాంటీన్, క్లాస్ రూమ్, స్నేహితులు అలాగే లవ్ సీన్లు ఆ తరువాత వారి మధ్య వచ్చే అపార్ధాలను సినిమాలో చూపించనున్నట్లు కనిపిస్తోంది. స్టోరీ లైన్ మాత్రం మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని అర్థం అవుతుంది. నయనం నయనం.. అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కంటెంట్ ను హైలెట్ చేస్తోంది. ఇక హేశం అబ్దుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫీల్ గుడ్ తరహాలో ఉంది. రష్మిక ఒక కాలేజ్ అమ్మాయి తరహాలో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. దర్శకుడు రాహుల్ ఇదివరకే చిలసౌ సినిమాలో కూడా భావోద్వేగ సన్నివేశాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని సీన్స్ కూడా మరీంత హైలెట్ కానున్నట్లు అర్ధమవుతుంది.