సర్వైవల్ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రూవ్ చేస్తూ మంచి సక్సెస్ అందుకుంది పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). ఈ సినిమా గత నెల 28న వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ఎమోషనల్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ 9 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1720 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది.

ఫస్ట్ వీక్ రన్ సక్సెస్ ఫుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న ది గోట్ లైఫ్..రెండో వారంలోకి అడుగుపెట్టింది. సెకండ్ వీక్ లోనూ స్ట్రాంగ్ హోల్డ్ తో బాక్సాఫీస్ వద్ద జర్నీ కంటిన్యూ చేస్తోంది. 90వ దశకంలో అరబ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన నజీబ్ అనే యువకుడు గల్ఫ్ ఏజెంట్ మోసాలకు గురై ఎడారిలో తీవ్రమైన కష్టాలు పడిన విధానాన్ని అత్యంత సహజంగా ప్రేక్షకులకు హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ.