Pushpa -2 : ఫస్ట్ వీక్ పుష్ప -2 కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పుష్ప -2 అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మొదటి వారం కంప్లిట్ చేసుకుంది.

Also Read : TheParadise : నాని ‘ద ప్యారడైజ్‌’కు కొత్త కష్టాలు

ఇక ఈ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ స్టార్ హీరోలకు న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది పుష్ప -2. ఇక మొదటి వారం ముగిసే నాటికీ ఈ సినిమా రూ. 1067 కోట్ల గ్రాస్ వసూలు చేసి హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అటు ఓవర్సీస్ లోను పుష్ప 2 రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్త దూసుకెళ్తోంది. తనకు ఇంతటి భారీ హిట్ అందించిన ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెప్పేందుకు మేకర్స్ థాంక్యూ ప్రెస్ మీట్స్ ను ప్యాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక లాంగ్ రాన్ లో పుష్ప ఎంత కలెక్ట్ చేస్తుందో అని ట్రేడ్ గమనిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *