
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3, ది ప్యారడైజ్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. హిట్ 3 మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, ది ప్యారడైజ్ సినిమాను దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాని ఒక కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. మరోవైపు, ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
అయితే, ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని, స్క్రిప్ట్ మార్పుల కారణంగా బడ్జెట్ పెరిగిపోయిందని, సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ప్రచారంపై చిత్రబృందం ఘాటుగా స్పందించింది.
సినిమా యూనిట్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా “ది ప్యారడైజ్ ప్రాజెక్ట్ పక్కాగా ముందుకు సాగుతోంది. అనవసరమైన రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదు. గజరాజు నడుస్తూ గర్జిస్తుంటే గజ్జి కుక్కలు అరుస్తాయి” అంటూ స్పష్టతనిచ్చింది. ఈ ప్రకటనతో సినిమా షూటింగ్ గురించి ఉన్న సందేహాలు తొలగిపోయాయి.
ప్రస్తుతం నాని ఈ రెండు సినిమాలతో బిజీగా ఉండగా, ది ప్యారడైజ్ గ్లింప్స్ ఇప్పటికే వైరల్ అయింది. త్వరలోనే సినిమా షూటింగ్ అప్‌డేట్స్, ఇతర నటీనటుల వివరాలు తెలియనున్నాయి. దసరా తర్వాత నాని మరో పాన్-ఇండియా హిట్ కొడతాడా? అనే ఆసక్తి నెలకొంది.