- మ్యాడ్ స్క్వేర్’ మూవీ నుంచి రెండో పాట విడుదల
- లిరికల్ వీడియోను విడుదల చేసిన చిత్ర బృందం
- యువతను ఆకట్టుకుంటున్న పాట
‘టిల్లు స్క్వేర్’తో ఘన విజయాన్ని సొంతంచేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ను రూపొందిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా చేస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి మొదటి పాట విడుదలైంది.
READ MORE: Pakistan: అమెరికా అసలు టార్గెట్ పాక్ అణ్వాయుధాలే.. భుట్టో సంచలన వ్యాఖ్యలు..
తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ నుంచి ‘నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతిరెడ్డి యూకే పాడారు. ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే వేలాది మంది వీక్షించారు. సురేష్ గంగుల.. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు. అప్పుడే యువతలో ఈ పాటకు క్రేజ్ పెరిగిపోతోంది. కాగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఫిబ్రవరి 26, 2025న తెరపైకి రానుంది.
READ MORE: Pawankalyan OG: పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక ప్రకటన..