
మలయాళంలో విడుదలై 9.1 IMDb రేటింగ్ సంపాదించిన ‘ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రజేస్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్, రెండు మహిళల జీవితాల్లో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటనల చుట్టూ నడుస్తుంది. నిరంజన, అనూప్, అజు వర్గీస్, శ్రీకాంత్ మురళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా థ్రిల్లింగ్ నేరేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం థియేటర్లలో ఒక నెల పాటు ప్రదర్శితమై ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. సమాజంలోని పురుషాధిక్యత (male dominance) గురించి న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఇవ్వడమే కాకుండా, సస్పెన్స్, థ్రిల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిపి కొత్త అనుభూతిని అందించింది. అనిల్ కృష్ణ, జోష్యా వీజే అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. నిరంజన మోహన్ ఈ చిత్రంతో తన నటనా నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఇప్పటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ, త్వరలో సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మేకర్స్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ కథ వల్లే IMDbలో 9.1 రేటింగ్ సాధించగలిగింది.