గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read : UnstoppableWithNBK : విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఆమేనట
తాజగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ తో ఈ సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. అందులో భాగంగా డాకు మహారాజ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫ్యాన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయట. ఇక ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు పేక్షకులు సీట్స్ లో కూర్చోరని, ఆ సన్నివేశాలకి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి ఆ రేంజ్ లో ఉంటుంది సినిమా అని చెప్పేసారు నాగవంశీ. అలాగే సెకండ్ హాఫ్ లో రాజస్థాన్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ఎన్నడూ చూడని బాలయ్యని ఈ సినిమాలో చూస్తారు. నా అభిమాన హీరో సినిమా ఇది. నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి సరైన సినిమాను బాలయ్యతో చేస్తున్న మీ అందరికి గుర్తుండే సినిమాగా డాకు మహారాజ్ నిలుస్తుంది.షార్ప్ రన్ టైమ్ తో ప్రతిదీ పకడ్బందీగా సెట్ చేస్తున్నాను సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాం అని నాగవంశీ తెలిపాడు.